Home » News » Billionaire Uday Kotaks Son Confirms Engagement To Former Miss India Aditi Arya
News

Uday Kotak Son Jay Kotak : అతనొక అపర కోటీశ్వరుడు .. కానీ ఎలాంటి అమ్మాయిని ప్రేమించాడో చూడండి .. ఛిఛీ !

Authored By
aruna
The Telugu News | Published on: May 28, 2023, 3:00 pm
Advertisement

Uday Kotak Son Jay Kotak : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జంట గురించి న్యూస్ వైరల్ అవుతుంది. కోటక్ మహేంద్ర బ్యాంక్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సురేష్ కొటక్ కుమారుడు జే ఇటీవల తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు. అందాల పోటీల యువరాణి ఫెమినా మిస్ ఇండియా 2015 విజేత అయిన అదితి ఆర్యతో తన నిశ్చితార్థాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కాన్వకేషన్ వేడుక నుండి అదితి ఫోటోలను పంచుకుంటూ జే బుధవారం ట్వీట్ చేశారు. నాకు కాబోయే భార్య అదితి ఈరోజు యేల్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసింది. ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది అన్నారు.

Advertisement

వ్యాపారవేత్త హర్ష గోయెంకా సహా పలువురు వ్యక్తులు ఈ జంటను అభినందించారు. వారు ఆనందంగా కొత్త జీవితంలో ప్రవేశించాలని ఆకాక్షించారు. గురుగ్రామ్ అమ్మాయి అయినా అదితి 2015 అందాల పోటీలో 52వ ఎడిషన్ లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ వరల్డ్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతకు ముందు మిస్ ఇండియా కిరీటాన్ని పొందే ముందు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని షహీద్ సుఖ్ దేవ్ కళాశాల నుండి బిజినెస్ స్టడీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ చదువును పూర్తి చేసింది. 2015 అందాల పోటీలో పోటీ చేయడంతో పాటు ఆమె ఆడిట్ సంస్థ అయిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో రీసెర్చ్ అనలిస్ట్ గా కూడా పని చేస్తోంది.

Advertisement

ఆ సమయంలో అనేక ఇంటర్వ్యూలలో ఎంబీఏ చదవాలన్న ఆసక్తిని వ్యక్తం చేసింది. 29 ఏళ్ల అదితి ఎల్లప్పుడూ బహిరంగ వేదికలపై విద్య ప్రాముఖ్యత గురించి చెబుతూ ఉండేది. నేర్చుకోవడం అనేది సామాజిక అంచనాల కోసం కాదు, సమాజం మీకు అందించిన వాయిస్ తో మెరుగ్గా పనిచేయడం కోస అని ఆమె గత సంవత్సరం ఇన్ స్టాగ్రామ్ లో వ్యాఖ్యను జోడించారు. ఇక సోషల్ మీడియాలో అదితికి 3.4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే అదితి బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ నటించిన 83వ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక త్వరలోనే అతిథి కొటక్ మహేంద్ర బ్యాంక్ సీఈవో కొడుకు జేను వివాహం చేసుకోనుంది.

Advertisement

 

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి