chandra babu naidu no appointment for akhila priya last few weeks
Akhila Priya : కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై ఇటీవలే విడుదల అయిన అఖిల ప్రియ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఆమె కు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కోపంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో కొనసాగడం సేఫ్టీ కాదేమో అనే అభిప్రాయంతో అఖిల ప్రియ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడట. అయితే ఆయన మాటల ద్వారా ఆమెకు ఎలాంటి సాంత్వన కలిగినట్లుగా లేదు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆమె ప్రయత్నించిందట.
హైదరాబాద్ లో ఉన్న అఖిల ప్రియ బెయిల్ పై విడుదల అయిన వెంటనే చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించిందట. అందుకోసం అపాయిట్మెంట్ ఇవ్వమని అడిగిందట. ఒక మాజీ మంత్రి నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉంటుంది. కాని అఖిల ప్రియ విషయంలో మాత్రం అలా లేదు. ఆయన కావాలని అఖిల ప్రియను దూరం పెడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అఖిల ప్రియ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆమెను చంద్రబాబు నాయుడు కలవాలని అనుకోవడం లేదు.
chandra babu naidu no appointment for akhila priya last few weeks
అఖిల ప్రియ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు ఎవరితో ఏం మాట్లాడలేక పోతున్నాడు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై కేసు ఉంది. ఆ కేసు కాస్త సీరియస్ గా ఉంది. ఇప్పుడు అఖిల ప్రియకు మద్దతుగా ఏం మాట్లాడినా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటున్నాడు అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నేను నీకు ఏం సాయం చేయలేను ఏమీ అనుకోకమ్మా అంటూ అఖిల ప్రియతో చంద్రబాబు నాయుడు అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.