అఖిలప్రియ పరిస్థితి ఏంటి? చంద్రబాబు చేతులు దులుపుకున్నట్టేనా? మరీ ఇంత ఘోరమా?
పాపం అఖిలప్రియ. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అడ్డంగా బుక్కయిపోయింది. తన తల్లిదండ్రులు లేకున్నా.. రాజకీయాల్లో వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని మంత్రి స్థాయికి ఎదిగింది కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక.. ఆమెను పట్టించుకునే వారే లేరు. పోనీ.. తన పార్టీలో ఉన్న నేత సమస్యల్లో ఉంటే చంద్రబాబబు అయినా పట్టించుకోవాలి కదా. కానీ.. పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి.

Why tdp neglecting akhila priya
భూమా కుటుంబం అంటేనే చంద్రబాబుకు నమ్మిన బంటులు. మధ్యలో వేరే పార్టీలోకి వెళ్లినా.. తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. కానీ.. భూమా శోభా నాగిరెడ్డి చనిపోవడంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఆమె మరణం తర్వాత వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. అప్పుడు చంద్రబాబు చాలామందిని వైసీపీ నుంచి లాగారు. పదవి ఆశలు చూపించారు.
దీంతో భూమా నాగిరెడ్డి కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించారు. టీడీపీలో ఉన్న సమయంలోనే భూమా నాగిరెడ్డి కూడా చనిపోయారు. దీంతో భూమా ఫ్యామిలీయే లేకుండా పోయింది. భూమా కూతురు అఖిల ప్రియ రంగంలోకి దిగింది. సానుభూతి కోసం అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు.
కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో భూమా ఫ్యామిలీకి కూడా కష్టాలు తప్పలేదు. అఖిలప్రియకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఆస్తుల గొడవలు, కిడ్నాప్ కేసులు ఆమెను వెంటాడుతున్నాయి. ఇటీవలే బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమె అరెస్ట్ అయింది.
కానీ.. ఆమె అరెస్ట్ పై టీడీపీ కనీసం స్పందించలేదు. చంద్రబాబు కిక్కుమనలేదు. ఆమెను పట్టించుకోవడమే మానేశారు. తమ పార్టీ నేత, మాజీ మంత్రి ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే కనీసం పట్టించుకునే నాథుడే లేడా టీడీపీలో. ఇదేనా టీడీపీ నేతలకు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత.. అంటూ కొందరు టీడీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారట.
టీడీపీకి దూరమే ఇక
చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అఖిలప్రియ టీడీపీకి దూరం అయినట్టేనని.. చంద్రబాబు అఖిలప్రియను దూరం పెట్టేశారని.. ఇక.. టీడీపీకి, ఆమెకు కాలం చెల్లిపోయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఇలా చంద్రబాబు కష్టకాలంలో పట్టించుకోకపోవడం.. అది పార్టీకే తీరని నష్టమని.. అది భవిష్యత్తులో పార్టీని దెబ్బతీస్తుందని అంటున్నారు. చూద్దాం మరి చంద్రబాబు భవిష్యత్తులో ఇంకేం చేస్తారో?