Allu Arjun : పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప చిత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. రిలీజ్ అయి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా అందరి నోళ్లల్లో నానుతూనే ఉంది. సామి సామి, ఊ అంటావా మావా, ఊహూ అంటావా మావా అనే పాటలు జనం నోళ్ళలో వినిపిస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయనకు సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం శనివారం పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం అల్లు స్నేహ రెడ్డి తండ్రి డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు స్నేహా రెడ్డి తండ్రి. పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్‌ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతోపాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్, సుబ్బిరామి రెడ్డి, భాను ప్రకాశ్ ఐఏఎస్,అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. పుష్పరాజ్‌ని గజమాలతో కూడా సత్కరించారు. చిరంజీవి ముందు బన్నీ ఇలాంటి సన్మానం జరుపుకోవడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఇక పుష్ప సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి పుష్ప 2 పైనే ఉంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ సహా ఆయన రచయితల బృందం ఈ సినిమా రెండవ భాగం బౌండ్ స్క్రిప్ట్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ 25 నుంచి షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఈఏడాది చివరలోనే పుష్ప 2 సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా సగ భాగం షూటింగ్ అయిపోయిందని సమాచారం.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.