Chicken Vepudu Recipe : చికెన్ అంటే సహజంగా అందరూ ఇష్టపడి తింటుంటారు. అయితే కొన్ని సమయాలలో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి కానీ పెళ్లిళ్లు కానీ వెళ్లినప్పుడు అక్కడ చికెన్ వెరైటీస్ గా చేస్తూ ఉంటారు. ఆ చికెన్ వేపుడు చాలా రుచిగా ఎంతో టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా చేస్తారు ఇంత రుచిగా వస్తుంది. అని అనుకుంటూ ఉంటాం.. ఇప్పుడు మనం అలాంటి చికెన్ వేపుడుని ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు; చికెన్ ,ఉప్పు ,పసుపు, ఆయిల్, కొత్తిమీర, కసూరి మేతి ,చికెన్ మసాలా, కారం, ధనియాలు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఒక కప్పు టమాటాలు, అరకప్పు ఉల్లిపాయలు మొదలైనవి..
తయారీ విధానం; ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఒక కేజీ చికెన్ వేసి దానిలో రాళ్ల ఉప్పు ఒక స్పూన్, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ అంతా ఇన్ని కే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత రెండు గరిటెల ఆయిల్ ను వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాట ముక్కలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
ఇది అవుతుండగా ఒక కడాయిలో నాలుగు స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు లవంగాలు, రెండు స్పూన్ల మిరియాలు, వేసి బాగా వేయించుకొని వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ ను దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కసురు మేతిని బాగా నలిపి దానిలో వెయ్యాలి. తర్వాత ఒక రెండు స్పూన్ల చికెన్ మసాలా వేసి బాగా తిప్పుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసి దింపుకోవాలి అంతే క్యాటరింగ్ స్టైల్ చికెన్ వేపుడు రెడీ..
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.