Marriage : మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. మరే దేశంలో లేని స్వేచ్చ మనదేశంలో ఉంటుంది. భిన్న మతాలు, కులాలు… జాతులు…తెగలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆచార సాంప్రదాయాలను పాటిస్తారు. పెళ్లి విషయంలో ఒక్కో జాతిలో ఒక్కో ఆచారం ఉంటుంది. అయితే మనదేశంలో పాశ్చాత్య కల్చర్ ఎక్కువగా కనిపించదు. విదేశాల్లో అయితే విచ్చలవిడిగా ఉంటుంది. నార్త్ ఇండియాలో లివింగ్ రిలేషన్ షిప్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. ఇది విదేశాల్లో చాలా కామన్. అయితే లివింగ్ తర్వాత నచ్చితే పెళ్లి లేకుంటే బ్రెకప్ అంటారు.
అయితే విదేశాల్లో అదరూ చేసేదే. కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడే కొంత మంది ఈ లివింగ్ రిలేషన్ షిప్ మెంటైన్ చేస్తున్నారు. ఇది కేవలం ఈ రోజుల్లో పుట్టుకొచ్చిన కల్చర్ మాత్రమే అనుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏళ్లనాటి నుంచి ఆచారం కొనసాగుతోంది. వినడానికి కొంచె అశ్చర్యంగా నే ఉన్నా ఇది నిజం.మనదేశంలో ఓ తెగ ఇప్పటికీ ఈ వింత ఆచారాన్ని ఫాలో అవుతోంది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే కొన్ని తెగల్లో సహజీవన సంప్రదాయం కొనసాగుతోంది. గరీసియా తెగలో ఈ ఆచారం శతాబ్దాలుగా ఉంది వాటిని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు.
యుక్త వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని కోరుకోవడానికి వీలుగా రెండు రోజుల జాతర నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ మగవాడితో పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తారు. అంతే కాకుండా అబ్బాయి కుటుంబం కన్యాశుల్కంగా అమ్మాయి కుటుంబానికి కొంత మొత్తం చెల్లిస్తారు. అప్పుడు సహజీవనం మొదలవుతుంది. భవిష్యత్తులో వీళ్లు పిల్లల్నికని పెళ్లికి సిద్ధం అయితే పెళ్లి ఖర్చు కూడా అబ్బాయి తరపువాళ్లే భరిస్తారు. అయితే ఇప్పటికీ ఈ ఆచార కొనసాగిస్తుండటం విశేషం.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.