Marriage : ఇక్క‌డ పిల్ల‌లు పుట్టాకే పెళ్లి.. పాత కాలంలో కూడా లివింగ్ రిలేష‌న్షిష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Marriage : ఇక్క‌డ పిల్ల‌లు పుట్టాకే పెళ్లి.. పాత కాలంలో కూడా లివింగ్ రిలేష‌న్షిష్

 Authored By mallesh | The Telugu News | Updated on :20 April 2022,6:00 am

Marriage : మ‌న దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. మ‌రే దేశంలో లేని స్వేచ్చ మ‌న‌దేశంలో ఉంటుంది. భిన్న మ‌తాలు, కులాలు… జాతులు…తెగ‌లు ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో ఆచార సాంప్ర‌దాయాల‌ను పాటిస్తారు. పెళ్లి విష‌యంలో ఒక్కో జాతిలో ఒక్కో ఆచారం ఉంటుంది. అయితే మ‌న‌దేశంలో పాశ్చాత్య క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా క‌నిపించ‌దు. విదేశాల్లో అయితే విచ్చ‌ల‌విడిగా ఉంటుంది. నార్త్ ఇండియాలో లివింగ్ రిలేష‌న్ షిప్ కొంచెం ఎక్కువ‌గా వినిపిస్తుంది. ఇది విదేశాల్లో చాలా కామ‌న్. అయితే లివింగ్ త‌ర్వాత న‌చ్చితే పెళ్లి లేకుంటే బ్రెక‌ప్ అంటారు.

అయితే విదేశాల్లో అద‌రూ చేసేదే. కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడే కొంత మంది ఈ లివింగ్ రిలేష‌న్ షిప్ మెంటైన్ చేస్తున్నారు. ఇది కేవ‌లం ఈ రోజుల్లో పుట్టుకొచ్చిన క‌ల్చ‌ర్ మాత్ర‌మే అనుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల‌నాటి నుంచి ఆచారం కొన‌సాగుతోంది. విన‌డానికి కొంచె అశ్చ‌ర్యంగా నే ఉన్నా ఇది నిజం.మ‌నదేశంలో ఓ తెగ ఇప్పటికీ ఈ వింత ఆచారాన్ని ఫాలో అవుతోంది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే కొన్ని తెగల్లో సహజీవన సంప్రదాయం కొనసాగుతోంది. గరీసియా తెగలో ఈ ఆచారం శతాబ్దాలుగా ఉంది వాటిని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు.

children are born here and get married living relationship

children are born here and get married living relationship

యుక్త వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని కోరుకోవ‌డానికి వీలుగా రెండు రోజుల జాతర నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ మగవాడితో పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తారు. అంతే కాకుండా అబ్బాయి కుటుంబం కన్యాశుల్కంగా అమ్మాయి కుటుంబానికి కొంత మొత్తం చెల్లిస్తారు. అప్పుడు సహజీవనం మొదలవుతుంది. భవిష్యత్తులో వీళ్లు పిల్లల్నికని పెళ్లికి సిద్ధం అయితే పెళ్లి ఖర్చు కూడా అబ్బాయి త‌ర‌పువాళ్లే భరిస్తారు. అయితే ఇప్ప‌టికీ ఈ ఆచార కొన‌సాగిస్తుండ‌టం విశేషం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది