daggabuati purandeshwari counter on Ysrcp
Daggubati Purandeswari : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తన భార్య పట్ల వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారని, తనకు నిండు సభలో కలిగిన అవమానానికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం కూడా చేశాడు. ఈ క్రమంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఎన్టీఆర్ కూతురు, బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించారు.
daggabuati purandeshwari counter on Ysrcp
తాము సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లుగా ఎంతో విలువలతో పెరిగామని తెలిపారు. వైసీపీ నేతల మాటల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు. భువనేశ్వరిపైన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని, భువనేశ్వరి క్యారెక్టర్‌ను కించపరచడం దారుణమైన చర్యని చెప్పారు పురందేశ్వరి. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనకు నిరసనగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉన్నప్పటికీ అప్పుడే పొలిటికల్ అట్మాస్పియర్ బాగా హీటెక్కింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ అప్పుడే యుద్ధం ప్రకటించేసింది.
మరో వైపున బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికార వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నది. ఇక రాజకీయ క్షేత్రంలో టీడీపీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించే చాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తంగా టీడీపీ రాజకీయ క్షేత్రంలో ఇక యుద్ధం మాదిరిగా వైసీపీతో తలపడనున్నది. మరో వైపున బీజేపీ-జనసేన కూడా సంయుక్త కార్యచరణతో ముందుకు సాగే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే, గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అయితే కనుక కచ్చితంగా అధికార వైసీపీని ఎన్నికల్లో ఓడించగలుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.