
do you know the son of gangavva
Gangavva : యూట్యూబ్ సంచలనం గంగవ్వ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆరంభంలో యూట్యూబ్‌కే పరిమితమైన గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రేజ్‌తో గత కొంత కాలంగా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. లవ్ స్టోరీలో నటించిన ఆమె.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నటిస్తోంది. తాను చిరంజీవికి అమ్మగా నటిస్తున్నానని కూడా గంగవ్వ చెప్పింది. మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ లో విడుదలైన వీడియోలలో గంగవ్వ ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగవ్వ తెలంగాణా యాక్సెంట్, ఆటిట్యూడ్, బిహేవియర్ యూట్యూబ్ ప్రేక్షకులకు మజా పంచేది.
గంగవ్వ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ దక్కేవి. గంగవ్వ గురించి అందరికి బాగానే సుపరిచితం. కాని ఆమె ఫ్యామిలీ గురించి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. గంగవ్వ తల్లిదండ్రి మరణించగా, ఆమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. తన భర్త సహకారం లేకుండానే గంగవ్వ ఇద్దరు కూతుర్లు, కొడుకు పెళ్లి చేసింది. గంగవ్వ కొడుకు రాజా రెడ్డి యూట్యూబ్ ఛానెల్‌కి డైరెక్టర్‌గా పని చేశాడు. 2019లో గంగవ్వ కొడుకు రాజా సూసైడ్ ఎటెమ్ట్ చేశాడు. పొలంలో పురుగు మందు తాగడడంతో అతడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకున్నట్టు సమాచారం.
do you know the son of gangavva
గంగవ్వ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘మల్లేశం’, ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇకపోతే ప్రస్తుతం గంగవ్వ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ లోనూ గంగవ్వ కీ రోల్ ప్లే చేసింది. కొద్ది రోజుల క్రితం గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి లో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తో పాటు బిగ్ బాస్ సీజన్ 4 లోని సభ్యులు శివజ్యోతి , అఖిల్ లు హాజరయ్యారు. నాగార్జున, బిగ్ బాస్ దయ వలన తాను కొత్త ఇల్లు నిర్మించుకున్నా అని గంగవ్వ తెలిపింది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.