Home » News » Dont Throw Away The Mango There Are A Lot Of Health Benefits
News

Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 6, 2024 11:42 pm
Advertisement

Mango : వేసవి కాలంలో మామిడి పండ్లు జోరుగా లభిస్తుంటాయి. మార్కెట్ల నిండా రకరకాల మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. అయితే వేసవికాలంలో మామిడి పండ్లు అన్నా.. మామిడి కాయలన్నా సరే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కొందరు మామిడి జ్యూస్ లు చేసుకుని తాగుతుంటారు. అయితే మామిడి కాయలో ఉండే టెంకలను అందరూ పారేస్తుంటారు. కానీ టెంకలతో అందులో ఉండే గింజలతో ఉండే లాభాలు తెలుసుకుంటే మాత్రం అస్సలు పారేయరు.

Advertisement

Mango : ఊబకాయం

మామిడి టెంకలోని గింజలతో ఊబకాయం ఉన్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక లక్షణాలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అంతే కాకుండా అధిక బరువును కూడా తగ్గించేందుకు సాయం చేస్తుంటాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని ఇప్పటికే చాలా సర్వేలు తెలిపాయి.

Mango : కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మామిడి టెంకలు అద్భుతంగా పని చేస్తాయి. మామిడి గింజలు రక్త ప్రసరణను అద్భుతంగా పెంచుతాయి. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. ఇది పరోక్షంగా సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

Mango : పొడి పెదవులు

మామిడి గింజలతో ఆయిల్ తయారు చేసుకోవాలి. ఇది వందశాతం సహజ లిప్ బామ్ గా పని చేస్తుంది. పెదవులను హైడ్రేట్ చేస్తుంది. దీన్ని పెట్టుకుంటే పెదాలు మృదువుగా ఎప్పుడూ తడితోనే ఉంటాయి. నిద్ర పోయే ముందు దీన్ని పెట్టుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

Advertisement

Mango : మొటిమలు

మీరు మామిడి గింజలతో ఒక స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మొటిమలతో పోరాడుతుందని చెప్పుకోవాలి. దీన్ని ఒక స్క్రబ్ లాగా చేసుకున్న తర్వాత టమాటోతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ఇతర రంధ్రాలు పూర్తిగా నయం అవుతాయి.

Mango : గుండె జబ్బు

మామిడి గింజలతో చాలానే లాభాలు ఉంటాయి. ఇది గుండె జబ్బులను అలాగే అధిక రక్తపోటును తగ్గించడంలో బాగానే సాయం చేస్తుందని ఇప్పటికే అనేక మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె జబ్బులు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి