Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

Mango : వేసవి కాలంలో మామిడి పండ్లు జోరుగా లభిస్తుంటాయి. మార్కెట్ల నిండా రకరకాల మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. అయితే వేసవికాలంలో మామిడి పండ్లు అన్నా.. మామిడి కాయలన్నా సరే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కొందరు మామిడి జ్యూస్ లు చేసుకుని తాగుతుంటారు. అయితే మామిడి కాయలో ఉండే టెంకలను అందరూ పారేస్తుంటారు. కానీ టెంకలతో అందులో ఉండే గింజలతో ఉండే లాభాలు తెలుసుకుంటే మాత్రం అస్సలు పారేయరు. Mango : ఊబకాయం మామిడి టెంకలోని […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

Mango : వేసవి కాలంలో మామిడి పండ్లు జోరుగా లభిస్తుంటాయి. మార్కెట్ల నిండా రకరకాల మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. అయితే వేసవికాలంలో మామిడి పండ్లు అన్నా.. మామిడి కాయలన్నా సరే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కొందరు మామిడి జ్యూస్ లు చేసుకుని తాగుతుంటారు. అయితే మామిడి కాయలో ఉండే టెంకలను అందరూ పారేస్తుంటారు. కానీ టెంకలతో అందులో ఉండే గింజలతో ఉండే లాభాలు తెలుసుకుంటే మాత్రం అస్సలు పారేయరు.

Mango : ఊబకాయం

మామిడి టెంకలోని గింజలతో ఊబకాయం ఉన్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక లక్షణాలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అంతే కాకుండా అధిక బరువును కూడా తగ్గించేందుకు సాయం చేస్తుంటాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని ఇప్పటికే చాలా సర్వేలు తెలిపాయి.

Mango : కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మామిడి టెంకలు అద్భుతంగా పని చేస్తాయి. మామిడి గింజలు రక్త ప్రసరణను అద్భుతంగా పెంచుతాయి. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. ఇది పరోక్షంగా సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Mango : పొడి పెదవులు

మామిడి గింజలతో ఆయిల్ తయారు చేసుకోవాలి. ఇది వందశాతం సహజ లిప్ బామ్ గా పని చేస్తుంది. పెదవులను హైడ్రేట్ చేస్తుంది. దీన్ని పెట్టుకుంటే పెదాలు మృదువుగా ఎప్పుడూ తడితోనే ఉంటాయి. నిద్ర పోయే ముందు దీన్ని పెట్టుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Mango మామిడి టెంకే కదా అని పారేయకండి ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

Mango : మామిడి టెంకే కదా అని పారేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

Mango : మొటిమలు

మీరు మామిడి గింజలతో ఒక స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మొటిమలతో పోరాడుతుందని చెప్పుకోవాలి. దీన్ని ఒక స్క్రబ్ లాగా చేసుకున్న తర్వాత టమాటోతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ఇతర రంధ్రాలు పూర్తిగా నయం అవుతాయి.

Mango : గుండె జబ్బు

మామిడి గింజలతో చాలానే లాభాలు ఉంటాయి. ఇది గుండె జబ్బులను అలాగే అధిక రక్తపోటును తగ్గించడంలో బాగానే సాయం చేస్తుందని ఇప్పటికే అనేక మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె జబ్బులు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది