Undavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవి పోటీ అక్కడి నుంచే.. టికెట్ కన్ఫమ్ అయినట్టేనా?

Undavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవి తెలుసు కదా. ఆమెది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఆమె ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఆమె గెలిచినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీ నేతలపైనే ఆమె తన అసమ్మతి రాగాన్ని వినిపించారు. వైసీపీ అధిష్ఠానంపై కూడా ఆమె గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కాకుండా.. టీడీపీకి శ్రీదేవి ఓటేసినట్టు తేలడంతో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఇక ఆమె టీడీపీలో చేరడం అధికారికం అయింది. ఆ తర్వాత వైసీపీ ముఖం కూడా చూడలేదు. తన సొంత నియోజకవర్గంలోనూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పర్యటించలేదు కానీ.. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాత్రం తాను పాల్గొన్నారు. తాడికొండకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకున్నప్పుడు ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే.. అమరావతి రైతులకు కూడా ఆమె క్షమాపణలు చెప్పారు. చివరకు తాను టీడీపీలో చేరుతున్నట్టు కన్ఫమ్ చేశారు.

from which constituency undavalli sridevi is contesting

Undavalli Sridevi : తాడికొండ నుంచే టీడీపీ నుంచి శ్రీదేవికి టికెట్ రానుందా?

అయితే.. తనకు వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా ముందు భావించారు. ఎందుకంటే.. తను వైసీపీ తరుపున 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచే గెలిచారు కాబట్టి. కానీ.. ప్రస్తుతం ఆమెకు అక్కడ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీడీపీ సర్వేలో తేలడంతో ఇక తనను తిరువూరు నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. కానీ.. శ్రీదేవికి మాత్రం తాడికొండ నుంచే పోటీ చేయాలని ఆసక్తి ఉంది. తను ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. కానీ.. తనకు చంద్రబాబు టీడీపీ సీటు ఇస్తారా లేదా అనేది డౌటే. తాడికొండలో టీడీపీ ఇన్ చార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను తిరువూరులో నిలబెట్టాలని భావిస్తున్నారట. తిరువూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. తిరువూరు నుంచి ఉండవల్లి శ్రీదేవిని పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Posts

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

3 hours ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

4 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

5 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

6 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

7 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

8 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

11 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

12 hours ago