girls kidnapped in Nigeria : నైజీరియాలో మరోసారి దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుండగులు తుపాకులతో ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించి, తుపాకులతో బెదిరించి 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే. నైజీరియాలోని జామ్ ఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగే కంటే ముందు దుండగులు సైనిక శిబిరంపైన, చెక్ పాయింట్ పైనా కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. కిడ్నాప్ చేసి బాలికలను సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఉంటారని అధికారులు చెప్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలికలను సురక్షితంగా రక్షించేందుకు పోలీసులు, మిలటరీ సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించింది.
గతంలో 2014లో బోర్నో స్టేట్ లోని చిబోక్ పాఠశాలలో ఉన్న 276 మంది బాలికలను ఇలానే కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు వీరిని విడిపించారు. కానీ, ఇందులో 100 మంది బాలికలు ఏమయ్యారు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు మరోసారి తాజాగా ఈ దారుణం చోటు చేసుకుంది. నైజీరియాలో బోకోహారం ఉగ్రవాదులకు అడ్డూ అదుపూ ఉండదు. వారిని నియంత్రించే ప్రభుత్వాలు ఇంతవరకూ పుట్టలేదు.
ఇటీవల కాలంలో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులను అపహరించడం యధేచ్ఛగా జరిగిపోతోంది..పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఆయుధాలతో తిరిగే ముఠాల సభ్యులు స్కూలు పిల్లలను బంధించడం ఇక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది. గత వారం నైజర్ సెంట్రల్ స్టేట్‌లో అపహరణకు గురైన 42 మందిని ఇంకా విడుదల చేయలేదు. అందులో 27 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. పోయినేడాది డిసెంబరులోనూ దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి చర్చల తర్వాత వదిలి పెట్టారు.
తాజాగా జరిగిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భద్రతాదళాలకు చెందినవారిలా దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆ పాఠశాలలో పనిచేసే టీచర్ చెబుతోంది.సాయుధులైన వ్యక్తులు విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాలలోకి ఎక్కించి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసినవెంటనే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. స్కూలు చుట్టుపక్కల ఉన్న పొదల్లో తమ పిల్లల కోసం వెతుకుతూ కనిపించారు. దాడి జరిగిన సమయంలో 421 మంది విద్యార్థులు ఉండగా కేవలం 55 మంది మాత్రమే స్కూలులో మిగిలారు. మిగిలిన వారంతా అపహరణకు గురయ్యారని టీచర్ చెప్పారు. ఉత్తర నైజీరియాలో ఆయుధాలు ధరించిన దుండగులు విద్యార్థులను అపహరించిన ప్రతి సారి 2014లో జరిగిన చిబోక్ అమ్మాయిల కిడ్నాప్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ ప్రాంతంలో గతంలో కూడా విద్యార్థులను స్కూళ్ల నుంచి అపహరించినప్పటికీ ఆ విషయాయలు బయటకు పొక్కలేదు.
నిజానికి ఆరోజు చిబోక్ అమ్మాయిలను ఎత్తుకుని వెళ్లిన బోకో హరామ్ సభ్యులు వారిని అపహరించాలనే ప్రణాళికతో రాలేదు. కానీ, స్కూలులో ఉన్న బల్లలను దొంగలించాలని వచ్చారు. కానీ అనుకోకుండా తమ దళాల్లో వారితో పెళ్లి జరిపించేందుకు అమ్మాయిలను వెంట తీసుకుపోయారు. దాంతో ఆ విషయానికి బాగా ప్రచారం లభించింది. ప్రభుత్వం కూడా దిగిరావడంతో ఇకపై పిల్లలను అపహరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పిల్లలను స్కూళ్ల నుంచి అపహరించడం వల్ల ప్రభుత్వం తమ షరతులకు డిమాండ్లకు తేలికగా ఒప్పుకుంటోంది. అయితే కిడ్నాపైన వారి విడుదల కోసం పెద్ద మొత్తంలో సొమ్మును, ఆయుధాలను ఉగ్రవాదులకు ఇస్తున్నారన్న వాదనను నైజీరియా ప్రభుత్వం ఖండిస్తోంది. పిల్లల కిడ్నాప్‌లు ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి వ్యూహం ఉన్నట్లు కనిపించటం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.