girls kidnapped in Nigeria : నైజీరియాలో భారీ సంఖ్యలో బాలికల కిడ్నప్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

girls kidnapped in Nigeria : నైజీరియాలో భారీ సంఖ్యలో బాలికల కిడ్నప్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

girls kidnapped in Nigeria : నైజీరియాలో మరోసారి దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుండగులు తుపాకులతో ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించి, తుపాకులతో బెదిరించి 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే. నైజీరియాలోని జామ్ ఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగే కంటే ముందు దుండగులు సైనిక శిబిరంపైన, చెక్ పాయింట్ పైనా కాల్పులకు […]

 Authored By brahma | The Telugu News | Updated on :1 March 2021,8:53 am

girls kidnapped in Nigeria : నైజీరియాలో మరోసారి దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుండగులు తుపాకులతో ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించి, తుపాకులతో బెదిరించి 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే. నైజీరియాలోని జామ్ ఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగే కంటే ముందు దుండగులు సైనిక శిబిరంపైన, చెక్ పాయింట్ పైనా కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. కిడ్నాప్ చేసి బాలికలను సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఉంటారని అధికారులు చెప్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలికలను సురక్షితంగా రక్షించేందుకు పోలీసులు, మిలటరీ సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించింది.

Nigerian Girls

girls kidnapped in Nigeria : గతంలో 276 మంది బాలికలు

గతంలో 2014లో బోర్నో స్టేట్ లోని చిబోక్ పాఠశాలలో ఉన్న 276 మంది బాలికలను ఇలానే కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు వీరిని విడిపించారు. కానీ, ఇందులో 100 మంది బాలికలు ఏమయ్యారు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు మరోసారి తాజాగా ఈ దారుణం చోటు చేసుకుంది. నైజీరియాలో బోకోహారం ఉగ్రవాదులకు అడ్డూ అదుపూ ఉండదు. వారిని నియంత్రించే ప్రభుత్వాలు ఇంతవరకూ పుట్టలేదు.

ఇటీవల కాలంలో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులను అపహరించడం యధేచ్ఛగా జరిగిపోతోంది..పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఆయుధాలతో తిరిగే ముఠాల సభ్యులు స్కూలు పిల్లలను బంధించడం ఇక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది. గత వారం నైజర్ సెంట్రల్ స్టేట్‌లో అపహరణకు గురైన 42 మందిని ఇంకా విడుదల చేయలేదు. అందులో 27 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. పోయినేడాది డిసెంబరులోనూ దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి చర్చల తర్వాత వదిలి పెట్టారు.

Nigeria Kidnapped Girls Horo

బాలికలే ఎందుకు

తాజాగా జరిగిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భద్రతాదళాలకు చెందినవారిలా దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆ పాఠశాలలో పనిచేసే టీచర్ చెబుతోంది.సాయుధులైన వ్యక్తులు విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాలలోకి ఎక్కించి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసినవెంటనే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. స్కూలు చుట్టుపక్కల ఉన్న పొదల్లో తమ పిల్లల కోసం వెతుకుతూ కనిపించారు. దాడి జరిగిన సమయంలో 421 మంది విద్యార్థులు ఉండగా కేవలం 55 మంది మాత్రమే స్కూలులో మిగిలారు. మిగిలిన వారంతా అపహరణకు గురయ్యారని టీచర్ చెప్పారు. ఉత్తర నైజీరియాలో ఆయుధాలు ధరించిన దుండగులు విద్యార్థులను అపహరించిన ప్రతి సారి 2014లో జరిగిన చిబోక్ అమ్మాయిల కిడ్నాప్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ ప్రాంతంలో గతంలో కూడా విద్యార్థులను స్కూళ్ల నుంచి అపహరించినప్పటికీ ఆ విషయాయలు బయటకు పొక్కలేదు.

నిజానికి ఆరోజు చిబోక్ అమ్మాయిలను ఎత్తుకుని వెళ్లిన బోకో హరామ్ సభ్యులు వారిని అపహరించాలనే ప్రణాళికతో రాలేదు. కానీ, స్కూలులో ఉన్న బల్లలను దొంగలించాలని వచ్చారు. కానీ అనుకోకుండా తమ దళాల్లో వారితో పెళ్లి జరిపించేందుకు అమ్మాయిలను వెంట తీసుకుపోయారు. దాంతో ఆ విషయానికి బాగా ప్రచారం లభించింది. ప్రభుత్వం కూడా దిగిరావడంతో ఇకపై పిల్లలను అపహరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పిల్లలను స్కూళ్ల నుంచి అపహరించడం వల్ల ప్రభుత్వం తమ షరతులకు డిమాండ్లకు తేలికగా ఒప్పుకుంటోంది. అయితే కిడ్నాపైన వారి విడుదల కోసం పెద్ద మొత్తంలో సొమ్మును, ఆయుధాలను ఉగ్రవాదులకు ఇస్తున్నారన్న వాదనను నైజీరియా ప్రభుత్వం ఖండిస్తోంది. పిల్లల కిడ్నాప్‌లు ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి వ్యూహం ఉన్నట్లు కనిపించటం లేదు.

Also read

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది