Home » News » Good News For Women Is That Modi Government Is Providing Free Sewing Machines
News

Free Sewing Machines : మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్స్ అందిస్తున్న మోడీ ప్రభుత్వం..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 12, 2022, 8:30 pm
Advertisement

Free Sewing Machines : దేశంలోని మహిళలు ఆర్థిక పరిస్థితుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు తీర్చుకోవడానికి వేరే వారిపై ఆధారపడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు నుండి జీవితంలో మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడుటకు మన భారత ప్రభుత్వం, పలు రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. ఆ పథకాలలో ఒకటి ఉచిత కుట్టు మిషన్ యోజన 2022, ప్రభుత్వం వారు ఆడవారికి ఉచితంగా కుట్టు యంత్రాలు అందజేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, మహిళలు ఎవరిపైన ఆధారపడకుండా చేయడం కోసం ప్రభుత్వంవారు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

Advertisement

ఈ పథకానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేయడం వలన ఉచితంగా కుట్టు మిషన్లు పొందవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి 50 వేల మందికి కుట్టు మిషన్లు ఉచితంగా, ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పథకానికి ఏ వయసు వారు అర్హులు చూద్దాం… కనీసం 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు దీనికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. గ్రామీణ, నగర, ప్రాంతాల ఆడవారికి ఉచిత కుట్టు మిషన్ల పథకం యొక్క ప్రయోజనాలను పొందుతారు. ఈ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవాలంటే ముందుగా దీని అధికారిక వెబ్సైట్, www.India.gov.in కి వెళ్ళాలి. ఈ లింక్ ని క్లిక్ చేయాలి.

Good news for women is that Modi government is providing free sewing machines

Advertisement

Free Sewing Machines : అన్ని వివరాలు దీనిలో ఇవ్వబడును. ఈ పథకాన్ని పొందుటకు కావలసిన పత్రాలు.

1 ) ఇన్కమ్ సర్టిఫికెట్
2) డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
3) ఆధార్ కార్డు
4) ఫోన్ నెంబర్
దీనికి దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా భారత మహిళలు ఉండాలి. ఆర్థిక స్తోమత లేని వారై ఉండాలి. ఈ పథకానికి వీరు మాత్రమే అర్హులు, దరఖాస్తుదారుని యజమాని ఆదాయం 12000 కు దాటి ఉండకూడదు. దివాంగులు వితంతువులు మీరు కూడా ఈ పథకానికి అర్హులు. దీన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి