
#image_title
Google | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ Alphabet విశాఖలో 1గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 6బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే షుమారు 50వేలకోట్లకు పైగా దీనిపై గూగుల్ వెచ్చించనుందని తెలుస్తుంది. ఎప్పటి నుంచో గూగుల్ విశాఖకు వస్తోందనే ప్రచారం జరుగుతోంది కానీ.. అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఆ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు.
#image_title
బిగ్గెస్ట్ డేటా సెంటర్..
ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఇంతకు మందు మాట్లాడినప్పుడు.. ఈ విషయం ఖరారయ్యాక మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా విశాఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్‌లో జరిగిన ఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడిన ఆయన.. “గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కు రాబోతోంది” అని చెప్పారు. తానే స్వయంగా వారికి స్థలం కూడా చూపానన్నారు. ఇది కార్యరూపం దాల్చితే. ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే అవుతుంది.
విశాఖకు రాబోయే డేటా సెంటర్ ఇండియాకే ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఎందుకంటే వైజాగ్‌లో నిర్మించేది గూగుల్ ఏషియాలో నిర్మాణం చేస్తున్న అతిపెద్ద సెంటర్. 1 గిగావాట్ సామర్థ్యంతో… 6బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్..వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుక గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. వైజాగ్ డేటా సెంటర్‌లో 2బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధనం (Renewable energy) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకే వినియోగించనుంది.మన ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేయాలంటే డేటా సెంటర్లు కీలకం. అది లేకపోతే సేవలన్నీ నిలిచిపోతాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.