Anasuya Hema : అనసూయ వివాదంపై హేమ ఫైర్.. ‘ముందు నోరుజారి.. తర్వాత కవరింగ్ ఇవ్వొద్దు’

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 August 2026, 6:41 pm
  •  Anasuya Hema టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చుట్టూ కొనసాగుతున్న ‘జై శ్రీరామ్’ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది

Anasuya Hema : టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చుట్టూ కొనసాగుతున్న ‘జై శ్రీరామ్’ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. శ్రీరాముడి నామాన్ని, ఆయన ఫొటోలను అడ్డుపెట్టుకుని కొందరు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్తా లీగల్ నోటీసుల వరకు వెళ్లింది. వివాదం ముదరడంతో అనసూయ డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నించారు. తాను కూడా ఆంజనేయస్వామి భక్తురాలినేనని, తన వ్యాఖ్యలు దేవుడిని ఉద్దేశించి చేసినవి కావని, కేవలం సోషల్ మీడియా ట్రోలర్లను ఉద్దేశించే మాట్లాడానని వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆమె క్లారిఫికేషన్‌తో వివాదానికి తెరపడుతుందని భావించినప్పటికీ పరిస్థితి పూర్తిగా చల్లారలేదు.

Anasuya Hema : అనసూయ వివాదంపై హేమ ఫైర్.. ‘ముందు నోరుజారి.. తర్వాత కవరింగ్ ఇవ్వొద్దు’

Anasuya Hema : అనసూయ వివాదంపై హేమ ఫైర్.. ‘ముందు నోరుజారి.. తర్వాత కవరింగ్ ఇవ్వొద్దు’

Anasuya Hema అనసూయ వివరణ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హేమ

అందరూ ఈ వివాదం ఇక ముగిసిందని అనుకుంటున్న సమయంలో సీనియర్ నటి హేమ అనూహ్యంగా రంగంలోకి దిగారు. అనసూయ వ్యాఖ్యలు, ఆమె వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ హేమ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ పరిశ్రమలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోకుండా అనసూయ పదేపదే నోరు జారడం సరికాదని హేమ వ్యాఖ్యానించారు. తాము ఉన్నది అద్దాల మేడలోనే అన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము చేసే ప్రతి మాట, ప్రతి వ్యాఖ్య కూడా ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని, అందువల్ల మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.
‘జై శ్రీరామ్’ అనేది కేవలం ఓ నినాదం కాదని.. కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో నిలిచిన దివ్య మంత్రం అని హేమ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా తనను వేధిస్తే ధైర్యంగా ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టి వారిపై పోరాడాలని అనసూయకు సూచించారు. అయితే ట్రోలర్లపై కోపాన్ని వ్యక్తం చేసే క్రమంలో పవిత్రంగా భావించే దేవుడి పేర్లు, ఫొటోలను ప్రస్తావించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె ప్రశ్నించారు.

‘ముందు నోరుజారి.. తర్వాత కవరింగ్ ఇవ్వొద్దు’

అనసూయ ముందుగా ఒక విధంగా మాట్లాడి, వివాదం తలెత్తిన తర్వాత వివరణ ఇచ్చుకోవడం మానుకోవాలని హేమ చురకలు అంటించారు. సోషల్ మీడియాలో ఏదైనా అంశంపై స్పందించే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలని సూచించినట్లు తెలుస్తోంది.అలాగే మనం చేసే పనుల ఫలితం ఏదో ఒక రూపంలో తిరిగి మన వద్దకే వస్తుందని, దానినే ‘కర్మ’ అంటారని హేమ పేర్కొన్నారు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని ఆమె స్పష్టం చేశారు. తెలుగు ప్రేక్షకులు, అభిమానులు అందించిన ఆదరణ వల్లే సినీ ప్రముఖులకు ఈ స్థాయి గుర్తింపు లభించిందని గుర్తు చేస్తూ.. అదే ప్రేక్షకుల విశ్వాసాలు, నమ్మకాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. హేమ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో ఇప్పటికే కొనసాగుతున్న ‘జై శ్రీరామ్’ వివాదం టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ ఇప్పటికే తన వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హేమ వ్యాఖ్యలకు ఆమె ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అనసూయ ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తారా? లేక తనదైన శైలిలో మరోసారి కౌంటర్ ఇస్తారా? అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp