Girl Friend : ప్రియురాలి కోసం అప్పులు చేశాడు .. చివరికి ఇలా అయ్యాడు ..
Girl Friend : ప్రేమ విషయంలో నేటి యువత చాలా పకడ్బందీగా ఉంటున్నారు. ప్రేమించే వ్యక్తి అందంగా ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టి అతడు మనకోసం ఖర్చు చేస్తాడా లేదా అని లెక్కలు వేసుకొని ఆ తర్వాత ప్రేమలో పడుతున్నారు. ఇక తాము ప్రేమించే వ్యక్తి ముందు బాగా ఉన్నవారిలా బిల్డప్ కొట్టేవారు. ఆ తర్వాత అప్పులపాలు అవుతున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన ప్రేయసి కోసం చేసిన అప్పులను తీర్చలేక, బాకీ ఇచ్చినవాళ్లు పెట్టే ఇబ్బందులను వర్ణిస్తూ ఒక పాట రాశాడు. దానిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశాడు.
సదరు ప్రేమికుడు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలోని ‘దిల్‌వాలే’ లోని ‘జీథాత జీసకే లియే జీసకే లియే మర్తథా’ అనే పాటకు పేరడీగా ఈ పాటను రాసాడు . ‘కితనా కర్జ్ హై మేరే సర్‌పే.. కైసే చుకాంవు ఉసే’ అంటూ సాగే ఈ పేరడీ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాను ప్రియురాలు కోసం చేసిన అప్పులు, అప్పులిచ్చిన వాళ్ళు బాధ పెడుతున్న తీరును వర్ణిస్తూ ప్రేమికుడు ఈ సాంగ్ ను రాసుకొచ్చాడు. దానిని వివరిస్తూ వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియా షేర్ చేయగా అది కాస్త ఇలా వైరల్ గా మారింది.
ఇప్పటిదాకా ఈ వీడియోకు 17 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నేను కూడా మీలాగే అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాను అని ఒకరు, ఇది నేరుగా గుండెపై ఎటాక్ బ్రదర్ అని మరొకరు, నువ్వు అచ్చం అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావని ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రేమికులంతా తాము ప్రేమించిన వ్యక్తి కోసం అప్పులు చేస్తూ ఇలా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా కొందరు అమ్మాయిలు అబ్బాయిల స్టేటస్ ను చూసి ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలోని అబ్బాయిలు కూడా తమ స్టేటస్ నిరూపించుకోవడానికి ఇలా అప్పుల పాలు అవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.