Categories: HealthNews

Honey and Garlic | తేనె+వెల్లుల్లి మిశ్రమం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి ఎనలేని మేలు!

Advertisement
Advertisement

Honey and Garlic | నేటి హైటెక్‌ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన వంటింట్లోనే దాగున్న సహజ ఔషధ గుణాలపై ఆస‌క్తి చూపుతున్నారు.. అలాంటి అద్భుతమైన ఆయుర్వేద పోషకమిశ్రమాల్లో ఒకటి – తేనెలో ముంచిన వెల్లుల్లి రెబ్బలు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

#image_title

తేనె+వెల్లుల్లి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

Advertisement

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

వెల్లుల్లి, తేనె రెండింటిలోనూ యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి, తరచూ వచ్చే జ్వరాల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.

జీర్ణవ్యవస్థ బలపడుతుంది

వెల్లుల్లి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. తేనెలో ఉన్న మంచి బాక్టీరియా గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం
లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సహజ కఫహరంగా పని చేస్తూ శ్లేష్మాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు

వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తాన్ని పలుచబరిచే, రక్తపోటును నియంత్రించే లక్షణాలున్నాయి. తేనెతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.

శక్తిని అందించడంతో పాటు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది

తేనె శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. వెల్లుల్లి ద్వారా రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది.
ఈ మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను నెమ్మదింపజేస్తాయి. జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడంలో సహాయపడతాయి

Advertisement

Recent Posts

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 29 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన దాసు.. సుమిత్ర కోసం దీప సాహసం

Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…

9 minutes ago

Banana Peels : అరటి తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా ?..ఇలా వాడితే ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!

Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…

40 minutes ago

Miracle medicine : ఈ ఒక్క కషాయంతో జలుబు, ఇన్ఫెక్షన్లకు చెక్..ఎలా వాడాలో తెలుసా?

Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…

2 hours ago

Zodiac Signs : 29 జనవరి 2026 గురువారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు జేబులో రాగి నాణెం ఉంచుకోండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…

3 hours ago

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…

4 hours ago

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

11 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

12 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

13 hours ago