Honey and Garlic | తేనె+వెల్లుల్లి మిశ్రమం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి ఎనలేని మేలు!
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన వంటింట్లోనే దాగున్న సహజ ఔషధ గుణాలపై ఆసక్తి చూపుతున్నారు.. అలాంటి అద్భుతమైన ఆయుర్వేద పోషకమిశ్రమాల్లో ఒకటి – తేనెలో ముంచిన వెల్లుల్లి రెబ్బలు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

#image_title
తేనె+వెల్లుల్లి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
వెల్లుల్లి, తేనె రెండింటిలోనూ యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి, తరచూ వచ్చే జ్వరాల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
జీర్ణవ్యవస్థ బలపడుతుంది
వెల్లుల్లి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. తేనెలో ఉన్న మంచి బాక్టీరియా గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం
లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సహజ కఫహరంగా పని చేస్తూ శ్లేష్మాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తాన్ని పలుచబరిచే, రక్తపోటును నియంత్రించే లక్షణాలున్నాయి. తేనెతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.
శక్తిని అందించడంతో పాటు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది
తేనె శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. వెల్లుల్లి ద్వారా రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది.
ఈ మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను నెమ్మదింపజేస్తాయి. జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడంలో సహాయపడతాయి