
Intersting Facts About This Type Of Wife
Good Wife : మనిషి ఎంత సంపాదించినా తృప్తి అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. ఆనందం కోల్పోతాడు. దానికి ఉదాహరణే ఈ కథ. ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కాని గుర్రానికి సరైన బేరం దొరకదు. దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు. మరొకరి సలహాతో గుర్రం నుంచి గాడిదను తీసుకుంటాడు. చివరకు గాడిదను ఇచ్చి బూట్లు తీసుకుంటాడు.
బూట్లు ఇచ్చి చివరకు ఒక టోపీ తీసుకుంటాడు. ఆ టోపీ పెట్టుకొని దారిలో వంతెన మీద నడుస్తూ వస్తుంటాడు. ఇంతలో రాయి తగిలి బోర్లా పడతాడు. దీంతో టోపీ కాస్త నదిలో పడుతుంది. దిగులుగా అటే చూస్తూ కుర్చుంటాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు వ్యక్తులు ఏమైందని అడుగుతారు. దీంతో అసలు విషయం చెబుతాడు. అయ్యో పాపం అని బాధపడతారు. నీకు ఇవ్వాల ఉపవాసమే అంటాడు ఒకడు. మరొకడు అయితే నీకు బడితపూజే అంటాడు. దీంతో ఆ వ్యక్తి నా పెళ్లాం అలాంటిది కాదు అంటాడు.
Intersting Facts About This Type Of Wife
నా పెళ్లాం ఏం అనదు అని వేటగాడు.. ఆ ఇద్దరితో అంటాడు. దీంతో వాళ్లిద్దరు కూడా వేటగాడి ఇంటికి వెళ్తారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలుస్తాడు. అతడి పెళ్లాం ఎదురుగా వచ్చి బావా వచ్చావా అంది ఆప్యాయంగా. అతడు జరిగింది అంతా చెప్పడం మొదలు పెట్టాడు. దీంతో గుర్రం ధర పలకకపోతే ఆవును తీసుకున్నా అంటాడు. దీంతో మంచి పని చేశారు పాలు తాగొచ్చు అంటుంది. ఆ తర్వాత ఆవును కాదని గాడిదను తీసుకున్నా అంటాడు వేటగాడు. దీంతో అడవి నుంచి కట్టెలు మోసుకొస్తుంది లేండి అంటుంది భార్య. గాడిదను అమ్మి చెప్పులు తీసుకున్నా అంటాడు వేటగాడు. దీంతో అడవిలో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుంది.
మంచిదే అంటుంది భార్య. అవి కూడా ఉంచుకోలేక టోపీ తీసుకున్నా అంటాడు. దీంతో ఆ టోపీలో అందంగా ఉంటారు అంటుంది భార్య. వస్తా ఉంటే నేను వంతెన మీద నడుస్తుంటే రాయి తాకి కింద పడబోతుంటే టోపీ నీళ్లలో పడిపోయింది అంటాడు. దీంతో పోతే పోయిందిలే.. నువ్వు పడలేదు. అంతా ఆ అడవి తల్లి దయ అంటుంది. గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను ఒక్క మాట కూడా అనకుండా, ఎత్తిపోపు మాటలు అనకుండా భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి ధన్యవాదాలు తెలిపింది. ఆమె మంచి మనసు చూసి ఆ ఇద్దరు బాటసారులు సిగ్గుతో తలదించుకొని పోతారు. ఇలాంటి భార్య ఎవ్వరికి దొరికినా కూడా వాళ్ల జీవితం స్వర్గమే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.