
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
Janaki Kalaganaledu 11 Aug Today Episode : జానకి కలగనలేదు 11 ఆగస్టు 2021 ఎపిసోడ్ 103 తాజాగా విడుదలైంది. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మీ ఇంట్లో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో.. అంతే సంతోషంగా ఉంచుతానని మీకు నేను మాటిచ్చాను. కష్టం కూడా దరిదాపుల్లో రాకుండా చూసుకుంటానని చెప్పాను. కానీ.. ఇప్పుడు మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే నేనేం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి.. జానకి గారు.. అని తనలో తాను అనుకుంటారు రామా. తనతో ఫోన్ మాట్లాడాక.. జానకికి గాయం అవ్వడం చూసి తట్టుకోలేకపోతాడు రామా. ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఎందుకు రామా.. కన్నీళ్లను దాచుకుంటున్నావు. తల్లికి బిడ్డ ఆకలి మాత్రమే కాదు.. మనసులో ఉన్న బాధ కూడా తెలుస్తుంది. ఈ ప్రపంచంలో తల్లీ బిడ్డ మాట్లాడుకోవడానికి భాష అవసరం లేదు నాన్న. బిడ్డ చెప్పకుండానే కన్నపేగుకు తెలిసిపోతుంది. నా కొడుకు చెప్పకపోతే.. వాడి బాధ నాకు అర్థం కాదా? నీ భార్య ఖార్ఖానాలో ఉన్నందుకు నీ మనసు ఎంత విలవిలలాడిపోతుందో నాకు తెలుసు నాన్నా. నీ మనసుకు కష్టం కలిగించి ఉంటే ఈ అమ్మను క్షమించు.. అనగానే అమ్మ.. వద్దు అమ్మ అంత మాట అనకు. ఆ దేవుడైనా తప్పు చేస్తాడేమో కానీ.. మా అమ్మ మాత్రం ఎలాంటి పొరపాటు చేయదు. మా అమ్మ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది నూటికి నూరు పాళ్లు సరైందే ఉంటుంది. అది ఒకరు వేలెత్తి చూపేలా ఉండదు. నాకు నువ్వు క్షమాపణలు చెబితే.. ఒక కొడుకుగా నేను ఓడిపోయినట్టే. ఈ భూమ్మీద నాకు అంతకన్నా ఎక్కువ బాధ మరొకటి ఉండదు అమ్మ.
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
మరి.. నా బిడ్డ కంట్లో కన్నీళ్లు వస్తే ఈ అమ్మకు బాధ ఉండదా? అందుకు కారణం నేనే అయితే నేనే తట్టుకోగలనా? అని జ్ఞానాంబ అంటుంది. దీంతో అమ్మ.. అత్తయ్యకు సేవ చేసుకోవడం కంటే.. మరో అదృష్టం ఇంకోటి ఉండదు. అత్తయ్యను అంతలా గౌరవించే నీ కోడలు.. నీ విషయంలో నామూషి అనుకోదు అమ్మా. నీకు ఎప్పటికీ అబద్ధం చెప్పదు.. అని రామా అంటాడు.
దీంతో నాకు తెలుసు నాన్నా.. జానకి తప్పు చేయలేదని నాకు తెలుసు. జానకికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం కోసమే తనను ఖార్ఖానాకు పంపించాను. మల్లికను బయటికి పంపిస్తుంటే… ఆరోజు జానకి అడ్డుపడింది. కానీ.. ఈరోజు మల్లిక వల్లనే జానకి ఖార్ఖానా వెళ్లిందని నాకు తెలుసు. ఇది జానకికి శిక్షణ మాత్రమే కానీ.. శిక్ష కాదు. నా కోడలు బాధపడితే.. నా కొడుకు కంట్లో నీరు వస్తుంది. నా కొడుకు బాధపడితే.. నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది. నాకొడుకును నేను బాధపెట్టుకుంటానా చెప్పు.. అని ఏడుస్తుంది జ్ఞానాంబ.
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
కట్ చేస్తే.. జానకి.. ఖార్ఖానాలో కూర్చొని ఐపీఎస్ కు ప్రిపేర్ అవుతుంటుంది. ఇంతలొ ఎవరో డోర్ కొడుతుంటారు. ఇంతలో మల్లిక లేచి.. నిద్ర పోతుంటే ఎవరహె.. అని వెంటనే లేస్తుంది మల్లిక. జానకి.. నీకు డోర్ చప్పుడు వినవస్తుందా? అని అడుగుతుంది. అవును.. వినొస్తుంది అంటే.. మరి వెళ్లి డోర్ తీయొచ్చు కదా.. అని అడుగుతుంది. నేను కవర్లు చేస్తున్నా అంటుంది. దీంతో వెళ్లి తనే డోర్ తీస్తుంది. బయటికి వెళ్లి చేస్తే ఎవ్వరూ ఉండరు. మళ్లీ వచ్చి డోర్ మూసి మళ్లీ పడుకుంటుంది.
అయితే.. డోర్ కొట్టి ఎవ్వరూ లేకపోతే అది దెయ్యమా? ఏంటి అని భయపడుతుంది మల్లిక. దీంతో నువ్వు భలే ఉన్నావు మల్లిక. దెయ్యాలు ఎక్కడున్నాయి.. అంటుంది. మళ్లీ డోర్ సౌండ్ అవ్వడంతో.. అయ్య బాబోయ్ దెయ్యం అని ముసుగేసుకొని పడుకుంటుంది మల్లిక. అది ఖచ్చితంగా దెయ్యమే.. అని అంటుంది మల్లిక. దెయ్యం గారు.. ఇక్కడ ఎవ్వరూ లేరండి.. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అనగానే మరోసారి డోర్ సౌండ్ అవుతుంది. దీంతో.. నేనే చూస్తాను ఆగు.. అని వెళ్తుంది జానకి. చూస్తే ఎవ్వరూ ఉండరు. వెంటనే రామా అక్కడికి వచ్చి.. జానకి గారు.. అని పిలుస్తాడు. అయ్యో మీరా.. ఈ టైమ్ లో ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. తనను చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అయ్యో.. మీరు ఎందుకు వచ్చారు. వద్దండి.. వెళ్లిపోండి. అత్తయ్య మిమ్మల్ని రావద్దన్నారు కదా. నన్ను కలవొద్దన్నారు కదా. ఎందుకు వచ్చారు. దయచేసి వెళ్లిపోండి.. అని అడుగుతుంది. దీంతో.. అమ్మను బాధపెట్టడం సబబు కాదు కరెక్టే ఒప్పుకుంటాను కానీ.. నా భార్య ఇలా బాధపడుతుంటే పట్టించుకోకుండా ఉండటం సబబా చెప్పండి.. అని అడుగుతాడు రామా.
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
ఏమండి.. నేను ఇప్పటి వరకు ఇటువంటి పనులు చేయలేదు. నేర్చుకునే క్రమంలో ఇవన్న కామన్. దీని కోసం ఎందుకండీ ఇదంతా. చిన్న గాయమే కదా.. అంటే నా భార్య కోసం చిన్నదా పెద్దగా అని ఆలోచించను.. అని రామా అంటాడు. అనుకోకుండా జరిగిన పెళ్లి. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి అని అనుకున్నా కానీ.. మీరు వల్ల నా కలలన్నీ తీర్చుకునే అవకాశం మళ్లీ కలిగింది. కానీ.. నా బాధంతా ఒక్కటే. నా కారణంగా స్వచ్ఛమైన మీ తల్లిదండ్రుల బంధాన్ని నేను ఎక్కడ విడదీస్తానో అని బాధపడుతున్నా.. అని జానకి అంటుంది. ఇది అమ్మ మాటను జవ దాటడం కాదండి.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే కదా.. మీకు ఇన్ని కష్టాలు.. అని అనగానే.. మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే నాకు అదృష్టం వస్తుందో లేదో తెలియదు కానీ.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే.. నాకు గొప్ప జీవితం వచ్చింది.. అంటూ జానకి అంటుంది.
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
ఏమండి.. మల్లిక మిమ్మల్ని చూస్తే కొంపలు అంటుకుంటాయి. వెళ్లండి.. అనగానే.. మిమ్మల్ని ఖార్ఖానా దగ్గర వదిలేసి వెళ్తాను.. రండి.. అనగానే.. ఖార్ఖానా ఏమన్నా పక్కనే ఉందా? అంటే.. నాకు వెళ్లబుద్ధి కావడం లేదు. అంటే మల్లిక ఉంది కదా.. అని అంటుంది. ఏంకాదు అండి.. మల్లిక ఒక్కసారి నిద్రపోతే.. మళ్లీ లేవదు.. అని అంటాడు. సరే.. పదా అంటుంది జానకి. లోపలి వరకు వస్తాను.. రండి అని ఖార్ఖానా లోపలికి కూడా వస్తాడు రామా. ప్లీజ్ వెళ్లండి.. మల్లిక లేస్తే ప్రాబ్లమ్ అవుతుంది అంటే.. అస్సలు వినడు.. ఇంతలో.. జానకి.. దెయ్యం ఉందా? వెళ్లిపోయిందా? అనేసరికి.. ఇద్దరూ దుప్పటి కప్పుకుంటారు. అయ్యో పడుకున్నావా? తలుపు తీసే ఉంది.. దెయ్యం వెళ్లిపోయిందా.. మాట్లాడవేంటి.. అని అంటుంది. ఇంతలో.. రామా కాళ్లు కనిపిస్తాయి. అమ్మో… ఇందాక నుంచి తలుపులు కొట్టింది బావ గారా? ఇప్పుడు వచ్చి దుప్పట్లో దూరారా? అత్తయ్యకు ఇక్కడికి వచ్చేలా చేసి.. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను.. ఆగు అని తన భర్తకు ఫోన్ చేస్తుంది. కానీ.. తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో డైరెక్ట్ గా పోలేరు అమ్మకే చేస్తా అని తన అత్తయ్యకు ఫోన్ చేస్తుంది. కానీ.. తన ఫోన్ జ్ఞానాంబ భర్త దగ్గర ఉంటుంది. ఆయన ఫోన్ ఎత్తగానే.. మామయ్య గారు.. ఖార్ఖానాలోకి బావ గారు వచ్చారు.. అంటే ఏంటి పాము వచ్చిందా? అంటాడు. కాదు.. బావ గారు వచ్చారు అంటే.. లేదు అమ్మ మాటను రామా ఏనాడూ జవదాటడు అంటాడు జ్ఞానాంబ భర్త.
janaaki kalaganaledu 11 august 2021 wednesday 103 episode highlights
కట్ చేస్తే.. తెల్లారి ఇంటికి వచ్చిన మల్లిక.. జ్ఞానాంబకు అసలు విషయం చెప్పేస్తుంది. రాత్రి బావ గారు ఖార్ఖానాకు వచ్చారు. మీ మాటను తుంగలో తొక్కారు.. అని అంటుంది. ఏమిటి నువ్వు చెప్పేది.. నువ్వు చెప్పేది నిజమా.. అని అంటుంది జ్ఞానాంబ. అవును.. నిజమే నేనే నా కళ్లారా చూశాను అత్తయ్య గారు.. అనగానే జ్ఞానాంబకు చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఏం చేస్తుంది.. అనే విషయం తెలియాలంటే.. గురువారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఆగాల్సిందే.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.