AP BJP : ఏపీ బీజేపీ సారథిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేతకు పట్టం కడతారా? ఏపీలో బీజేపీని పరుగులు పెట్టించే నాయకుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ సారథిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే.. ఏ ఎన్నికలోనూ.. బీజేపీ పుంజుకున్న పరిస్థితి లేదు. అదే సమయంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను బీజేపీపెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ రత్నప్రభను రంగంలోకి దింపారు. ఉప పోరుకు దాదాపు మూడు మాసాల ముందు నుంచి బీజేపీ నేతలంతా తిరుపతిలో మకాం వేసి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ ఉప ఎన్నికలో కనీసం మార్కులు కూడా సంపాదించలేక పోయారు. ఇక, స్థానికంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సోము వీర్రాజు నాయకత్వంపై, పార్టీ భవితపై కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సోము వీర్రాజు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేయడం వల్ల.. అప్పటి వరకు క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాల్లో బీజేపీపై ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనే వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో సోము వీర్రాజు తన సొంత సామాజిక వర్గాన్నయినా.. బీజేపీవైపు మళ్లించారా ? ఈ విషయంలో అయినా సక్సెస్ అయ్యారా ? అంటే.. అది కూడా కనిపించడం లేదు.
ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపు ఇచ్చినా.. నాయకులను ముందుండి నడిపించడంలోను, బలమైన వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాలను అమలు చేయడంలోనూ బీజేపీ చతికిల పడిందనే వాదన ఉంది. ఇక, సోము వీర్రాజు ఏ నినాదం అందుకున్నా.. ఆయనను అనుసరించేవారు కూడా ఇటీవల కాలంలో తగ్గిపోయారు. దీంతో ఇక, సోము వీర్రాజును పక్కన పెట్టడం తప్ప బీజేపీ అధిష్టానం ముందు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో మరో ఆరేడు నెలల్లోనే సోము వీర్రాజును పక్కన పెట్టి.. కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో కమ్మ సామాజిక వర్గానికి, ఆ తర్వాత .. 2సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు బీజేపీ అధిష్టానం ఏపీలో పగ్గాలు అప్పగించింది.
అయితే.. కమ్మ నేత కంభంపాటి హరిబాబు.. పార్టీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఒకింత మెరుగైన ఫలితాలే సాధించారు. కానీ, కాపు నాయకత్వం తెరమీదికి రావడంతో .. కమ్మ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇక, రెడ్డి సామాజిక వర్గం అంటీముట్టనట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే తప్ప.. తమ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని భావిస్తున్న బీజేపీ త్వరలోనే రాష్ట్ర పార్టీ పగ్గాలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు అప్పగించే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
This website uses cookies.