Home » Entertainment » Janakai Kalaganaledhu Fame Priyana And Amardeep In Comedy Stars
Entertainment

Janaki Kalaganaledu: ఆ ఇద్దరి శోభనాన్ని భలే వాడుకుంటున్నారు!.. పాపం ‘జానకి కలగనలేదు’ టీం..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: July 29, 2021, 7:00 pm
Advertisement

జానకి కలగనలేదు సీరియల్ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. మౌనరాగం సీరియల్‌లో అమ్ములుగా ఎంతో ఫేమస్ అయిన ప్రియాంక.. ఇప్పుడు జానకిగా అదరగొడుతోంది. ఇక అమర్ దీప్ అయితే రాముడి పాత్రలో దుమ్ములేపేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరికి పెళ్లి అయినా కూడా ఇంకా శోభనం జరగడం లేదు. ఎన్ని ఎపిసోడ్‌లకు శోభనం జరుగుతుందో అని మీమ్స్, ట్రోల్స్‌లతో ఈ సీరియల్ ట్రెండ్ అవుతోంది. ఇక బుల్లితెర సెలెబ్రిటీలు సైతం ఈ విషయంలో బాగానే సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

మొన్నా మధ్య దేవత ఫేమ్ అర్జున్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కౌంటర్ వేశాడు. నాకు అయితే మొదటి ఎపిసోడ్‌లోనే అయిపోయింది.. పాపం వీళ్లకే ఇంకా అవ్వడం లేదు అని కౌంటర్ వేశాడు. అలా అన్ని చోట్లా వీరి శోభనం గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఇక పరివార్ చాంపియన్ షిప్‌లోనూ అమర్ దీప్, ప్రియాంకలు ఫుల్ హల్చల్ చేస్తున్నారు. అయితే ఇందులో కూడా శోభనం సీన్‌ను తెగ వాడుకుంది.

Advertisement

‘జానకి కలగనలేదు’ టీం రచ్చ

పరివార్ చాంపియన్ షిప్ షోలో ప్రియాంక, అమర్ దీప్‌లు రచ్చ చేస్తున్నారు. ఈ ఇద్దరితో అవినాష్ స్పెషల్ స్కిట్ వేయించాడు. అందులో కూడా ఈ ఇద్దరి శోభనం గురించే ఉంది. సముద్రం మధ్యలో ఉప్పెన స్టైల్లో స్కిట్ ప్లాన్ చేశాడు. సినిమాలో జరిగినట్టు శోభనం జరుగుతుందని భావిస్తే.. అక్కడ కూడా జానకీ రాములు ఫెయిల్ అవుతున్నట్టే కనిపిస్తోంది. మొత్తానికి అవినాష్ కూడా ఇలా సీరియల్ టీంను వాడేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి