Janaki Kalaganaledu 10 Aug Today Episode : జ్ఞానాంబ మాట కాదని ఖార్ఖానాలో జానకిని కలిసి తనతో పాటు పడుకున్న రామా.. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Janaki Kalaganaledu 10 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 10 ఆగస్టు 2021 విడుదలైంది. మంగళవారం ఎపిసోడ్ 102 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి గురించి.. రామా.. రామా గురించి జానకి ఇద్దరూ తెగ ఆందోళన పడతారు. ఖార్ఖానా అంతా పొగ వాసన వస్తుంది. పాపం జానకి గారు ఎలా నిద్రపోతారు.. అని తనలో తానే అనుకుంటాడు రామా. నేను సరిగ్గా నిద్రపోయానో లేదో అని తెలియక రామా టెన్షన్ పడుతున్నాడు కావచ్చు. నా గురించి బాధపడుతూ.. ఆయన సరిగ్గా భోజనం కూడా చేసి ఉండడు. పగలంతా షాపులో నిలబడే ఉంటాడడు. రాత్రి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోకుంటే ఎలా? అని ఆలోచిస్తుంటుంది జానకి.

ఇంతలో రామాకు జానకి ఐపీఎస్ కోసం చదివే బుక్స్ కనిపిస్తాయి. వాటిని చూస్తూ బాధపడుతుంటాడు. ఐపీఎస్ పరీక్షలకు చదువుకుంటానని జానకి గారు ఆనందంతో పొంగిపోయారు. చదువు మొదలు పెట్టగానే.. పాపం ఇలా జరిగిపోయింది. చదువుకునే అవకాశం ఇలా చేజారిపోవడం చాలా బాధ వేస్తోంది. ఐపీఎస్ నా కల. నా కలను తన కలగా స్వీకరించి.. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నా భర్త. కానీ.. నాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఇంకా ఎన్ని సమస్యలతో నేను యుద్ధం చేయాలో.. అంటూ బాధపడుతుంది జానకి.

కట్ చేస్తే.. జానకి దగ్గరికి వెళ్లడానికి మల్లిక బట్టలు సర్దుకుంటుంది. నేను ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగింది. జానకి.. కుట్టించుకొచ్చిన చెప్పులు తెంపి పెద్ద తప్పు చేశాను. తనకు శిక్ష వేద్దామనుకుంటే.. నాకు శిక్ష పడింది.. అని తెగ బాధపడుతుంది మల్లిక. మీరు వెళ్లిపోతున్నారా.. వెళ్లిపోతున్నారా.. అంటూ చికిత హేళన చేస్తుంది.

janaki kalaganaledu 10 aug 2021 tuesday 102 episode highlights

కట్ చేస్తే జ్ఞానాంబ.. తన భర్తకు కిల్లీ తినిపిస్తుంటుంది. ఇంతలో మల్లిక వచ్చి అత్తయ్య గారు నేను వెళ్తున్నాను.. అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు.. పుట్టింటికి వెళ్తున్నావా? అని అడుగుతుంది. లేదండి.. నేను పుట్టింటికి ఎందుకు వెళ్తాను… అంటూ అంటుంది. నన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నీకు బాధగా ఉందా? అయ్యో పాపం.. నీ మాటలు వినయం కొత్తేం కాదు కానీ.. అక్కడ జానకి ఒంటరిగా ఉంది.. త్వరగా వెళ్లు.. అంటూ మల్లికకు చెబుతుంది. ఆ తర్వాత మామయ్య గారు వెళ్లి వస్తానండీ.. అనగానే నీదే లేట్ అండి.. అంటాడు. అయితే.. తనకు అస్సలు ఇంట్లో నుంచి వెళ్లాలని ఉండదు. ఏదో ఒకటి నసుగుతూనే ఉంటుంది మల్లిక. నీ మాటలు ఇక చాలు కానీ.. వెళ్లు అని అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 10 aug 2021 tuesday 102 episode highlights

బయటికి వెళ్లగానే.. రామా అక్కడ ఉంటాడు. ఏంటి బావ గారు అని అనగానే.. ఏం అనుకోకుండా.. ఈ సంచి జానకి గారికి ఇస్తావా? అని అడుగుతాడు. దీంతో హమ్మయ్య.. మన చెప్పు మ్యాటర్ తెలియలేదు అనుకుంటా.. అని లోపల సంతోష పడుతుంది మల్లిక. సంచి బరువుగా ఉండేసరికి.. జానకి ఏం చదువుతోంది.. ఇంత బరువు ఉన్నాయి.. అని అడుగుతుంది మల్లిక. ఇవి.. పార్శిల్ కోసం.. అని అంటాడు రామా. సరే.. అని తీసుకెళ్తుంది. అలాగే.. జానకి గారితో ఒకసారి ఫోన్ లో మాట్లాడించు.. అని చెప్పగానే తప్పుకుండా బావగారు అని చెప్పి వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 10 aug 2021 tuesday 102 episode highlights

 

Janaki Kalaganaledu 10 Aug Today Episode : రామా పంపించిన పుస్తకాలు చూసి మురిసిపోయిన జానకి

 

పుస్తకాల సంచిని పట్టుకొని ఖార్ఖానాకు వెళ్తుంది మల్లిక. ఏంటి మల్లిక ఇలా వచ్చావు.. అని అడిగితే.. మీ అత్త గారు నీకు తోడుగా పడుకోమ్మని పంపించారు.. అని చెబుతుంది. మీ అత్త కాదు.. మన అత్త అని అంటుంది జానకి. సరేలే.. ఇదిగో బావ గారు ఈ పుస్తకాలు పంపించారు. పార్శిల్ కోసం అని చెప్పగానే.. ఆ పుస్తకాలను చూసి జానకి తెగ సంతోషిస్తుంది. అయితే.. జానకికి మెల్లగా జ్ఞానాంబ మీద కోపం తెప్పించడం కోసం తనపై చాడీలు చెప్పాలని ట్రై చేస్తుంది. ఇంతలో రామా.. మల్లికకు ఫోన్ చేస్తాడు. మాట్లాడు.. అంటూ ఫోన్ ఇస్తుంది. దీంతో బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. అబ్బో.. అత్త అంటే ఇంత అభిమానమా జానకికి.. అని తెగ ఆలోచిస్తుంటుంది.

janaki kalaganaledu 10 aug 2021 tuesday 102 episode highlights

మరోవైపు ఏమండి.. ఎలా ఉన్నారు.. అని అడుగుతుంది జానకి. మీరు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అంటే ఏమండీ.. నేను ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. బాధ అస్సలు లేదు. నా గురించి మీరు అంతలా బాధపడుతుంటే తట్టుకోలేను. ఉన్నపళంగా అక్కడికి వచ్చేయాలని ఉంది.. అంటే నాకు కూడా అలాగే ఉంది. నిన్ను చూడాలని మనసు ఆరాటపడుతోంది.. అని అంటాడు రామా. మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నా. నా ప్రాణం మాత్రం మీదగ్గరే ఉంది.. అనగానే.. ఇంకా రెండు రోజులు మాత్రమే కదా ఉంది.. అత్తయ్య గారు చెప్పిన పనులన్నీ నేర్చుకొని రెండు రోజుల్లో వచ్చేస్తా కదా.. అంటూ ఫోన్ ను ఎడమ చేయితో ఫోన్ ను పట్టుకుందామనుకోగానే.. తన ఎడమ చేయికి గాయం అవ్వడంతో అమ్మ అంటుంది. ఏమైంది జానకి గారు.. అనగానే చిన్న గాయం అయింది అని అంటుంది జానకి. వామ్మో.. గాయమా.. అంటూ తెగ భయపడిపోతాడు రామా. ఏం కాదు లేండి.. చిన్నగాయమే.. అంటాడు. ఇక ఉండబట్టలేక.. జానకిని చూడాలనిపించి.. వెంటనే ఖార్ఖానాకు వెళ్లిపోతాడు రామా. రామా ఖార్ఖానాకు వచ్చి జానకి దగ్గర పడుకోవడం చూస్తుంది మల్లిక. వెంటనే ఎవరికో ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

4 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

7 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

10 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

11 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

14 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

17 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago