Home » Andhra Pradesh » Jr Ntr And Kalyan Ram Gets Emotional After Seeing Taraka Ratna Mother
andhra pradesh

Taraka Ratna : తారకరత్న తల్లి భాధ చూసి ఎమోషనల్ అయినా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: February 20, 2023, 6:03 pm
Advertisement

Taraka Ratna : నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. శనివారం రాత్రి బెంగళూరు నుండి ఆయన స్వగృహానికి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం నందమూరి కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు ఆయనకు నివాళులర్పించారు. ఇక సరిగ్గా సోమవారం అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్ ఫిలింనగర్ నందు భౌతికకాయాన్ని మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచడం జరిగింది. చివరి చూపు కోసం నందమూరి కుటుంబ సభ్యుల అభిమానులు భారీ ఎత్తున వచ్చారు. దీనిలో భాగంగా కొడుకు తారకరత్ననీ చూసి తల్లడీల్లి పోయింది.

Advertisement

Jr NTR And Kalyan Ram Gets Emotional After Seeing Taraka Ratna Mother

ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యులతో వచ్చి తారకరత్న పార్థివ దేహాన్ని చివరి చూపు చూడడం జరిగింది. ఈ క్రమంలో తారకరత్న తల్లి విలపించటం అక్కడ ఉన్న నందమూరి కుటుంబ సభ్యులందరినీ కలిచి వేసింది. కడసారి చూపుకు నందమూరి కుటుంబ సభ్యులందరితోపాటు విక్టరీ వెంకటేష్, తరుణ్, ఘట్టమనేని ఆది శేషగిరిరావు మరి కొంతమంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు రావడం జరిగింది. ఫిలింనగర్ ఛాంబర్

Advertisement

నందు తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతా కొడుకు శవాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నాన్నా లేరా అంటూ తల్లి వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో తల్లిదండ్రులను సముదాయించడం అక్కడి వారి వలన కాలేదు. చివరి చూపు కోసం భారీ ఎత్తున అభిమానులు ప్రముఖులు రావడం జరిగింది. నివాళులు అర్పించిన వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. తాను బాలకృష్ణతో చేయబోతున్న సినిమాలో తారకరత్నకి మంచి పాత్ర సెట్ చేయటం జరిగింది. ఈలోపే ఆయన మరణించడం బాధాకరమని అన్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి