Jr NTR : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయమై నానా రచ్చ చేస్తున్నారు. ఇదే అదునుగా వైకాపా నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు గుర్తిస్తున్నారు. మరో వైపు ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదు అంటూ ఆయన్ని కూడా నానా రకాలుగా కొందరు టిడిపి నాయకులు మరియు నందమూరి కుటుంబాలు అభిమానులు విమర్శిస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు మార్పు నుండి ఎన్టీఆర్ సరిగా స్పందించలేదు అనే వైపుకు ఇష్యూ మళ్ళింది. అసలు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందిన వాడే కాదంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు, వారు అలాంటి విమర్శలు చేయడానికి కారణం ఏదో ఒక సమయంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ టేకోవర్ చేస్తాడు.. ఆ సమయంలో నారా ఫ్యామిలీకి కష్టాలు తప్పవు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండవచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ని సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీకి మరియు నందమూరి ఫ్యామిలీకి దూరం ఉంచాలని నారా వారు ప్రయత్నిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఒక ఊపు ఊపేస్తాడని రాజకీయ ఉద్దండుడు అయిన చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడేమో అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏమాత్రం సత్తా చాట లేకపోయాడు, కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ని తన హస్తగతం చేసుకోవడం ఖాయం.. దాన్ని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడం ఖాయం అని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన్ని నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీకి సాధ్యమైనంత దూరం పెట్టాలని అంతా భావిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగానే అంటున్నారు.
ఎన్టీఆర్ ని టీడీపీ నాయకులు విమర్శించడానికి కారణం అదే అయ్యుంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే ఇంత వ్యతిరేకత ఉందా? ఆయనకు ఇంత సత్తా ఉందా అంటూ స్వయంగా ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలా అయితే ఎన్టీఆర్ రాజకీయం ముందు పవన్ కళ్యాణ్ రాజకీయం వేస్ట్ కదా అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేదేమో కానీ సంవత్సరాని ఒకసారి అన్నట్లు ఇలాంటి రగడ రచ్చ జరుగుతూనే ఉంది. ఒకవేళ రావడం అంటూ జరిగితే ఎన్టీఆర్ ఓ సింహాద్రి.. ఓ ఆది.. ఎలా అయితే సక్సెస్ దక్కించుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆ స్థాయిలోనే రాజకీయాల్లో ఎన్టీఆర్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నామని అభిమానులు అంతా ఆసక్తిగా కామెంట్స్ చేస్తున్నారు.
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.