how BalaKrishna feels with memes
Balakrishna : మీకు గుర్తుందా? 2005 లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ ఘటన. ఈ జనరేషన్ యూత్ కు ఆ ఘటన గురించి తెలియకపోవచ్చు కానీ… టాలీవుడ్ లో ఆ ఘటన అప్పట్లో పెద్ద దుమారం లేపింది. టాలీవుడ్ హీరో బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్… వీళ్లిద్దరి మధ్య జరిగిన కాల్పుల ఘటన పెద్ద షాకింగ్. ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలకృష్ణ… తన గన్ తో నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై కాల్పులు జరిపారు. అయితే.. బెల్లంకొండ సురేశ్ ప్రాణాలతో బయటపడటంతో… ఆ ఘటనను అందరూ వదిలేశారు కానీ… అసలు ఆరోజు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి బాలకృష్ణ ఎందుకలా ప్రవర్తించారు… అనే దాని గురించి నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు.
kakarla subbarao about tollywood hero balakrishna
ఆయన ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో ఇదివరకే తీసుకున్న ఇంటర్వ్యూనూ ఆంధ్రజ్యోతి తమ యూట్యూబ్ చానెల్ లో తాజాగా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బాలకృష్ణ కాల్పుల గురించి.. అసలు ఏం జరిగింది అనే విషయాలను సుబ్బారావు స్పష్టం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో ఉంది. అయితే…. ఆ రోజు రాత్రి జరిగిన విషయం గురించి కాకర్ల ఏమాత్రం దాచుకోకుండా అన్ని విషయాలు ఆర్కేతో పంచుకున్నారు.
బాలకృష్ణ… బెల్లంకొండ సురేశ్ పై కాల్పులు జరపకపోయి ఉంటే మాత్రం.. ఆరోజు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకునేవాడని కాకర్ల సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఆ సంగతి తెలిసి… ఇద్దరు పెద్ద సైకియాట్రిస్టులను పిలిచి… వాళ్లను చెక్ చేయమన్నాను. ఆ టైమ్ లో అలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు… ఎదుటి వాళ్లను ఏమైనా చేయాలి.. లేదంటే తమను తాము ఏదైనా చేసుకోవాలని ఆవేశపడతారు. బెల్లంకొండ సురేశ్ ను కాల్చాడు కాబట్టి… బాలకృష్ణ నార్మల్ అయిపోయాడు కానీ… ఒకవేళ బెల్లంకొండ సురేశ్ ను కాల్చకపోయి ఉంటే… బాలకృష్ణ తనను తాను కాల్చుకునేవాడు… అని కాకర్ల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
Farmers : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.…
Funnel Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ మారిన పడుతూనే ఉన్నారు. వారి సంఖ్య రోజుకి…
Guava Leaf Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలని కొన్ని రకాల టీ…
Numerology : ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పడ్డప్పుడు వారు విజయాన్ని సాధిస్తారో లేదో తెలియదు కానీ వారు మాత్రం…
This website uses cookies.