Karthika Deepam 13 Aug Today Episode : దీప చూపించిన వీడియో చూసి.. కార్తీకే మోనితను చంపాడని తెలుసుకున్న సౌందర్య? కార్తీక్ కు శిక్ష పడటం ఖాయమా?

Karthika Deepam 13 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 13 ఆగస్టు 2021, శుక్రవారం 1117 తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. కార్తీక్ ను విడుదల చేసి నన్ను అరెస్ట్ చేయండి.. అంటూ సౌందర్య పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. సౌందర్య అబద్ధం చెబుతుందని తెలుసుకున్న ఏసీపీ.. మీకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో.. నాకు నా డ్యూటీ మీద అంత ప్రేమ. మీరు రెండు గంటల కిందనే శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. డైరెక్ట్ గా దీప ఇంటికి వెళ్లి అక్కడ కార్తీక్ కారులో ఈ గన్ పట్టుకొని వచ్చారు.. అని ఏసీపీ చెప్పగానే.. మీరు ఇంత తెలివి ఉన్నవారు.. కార్తీక్ ఈ నేరం చెయ్యలేదని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.. అని అంటుంది సౌందర్య.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

నా కొడుకు ఈ నేరం చేస్తుంటే ఎవరైనా చూశారా? అని అడుగుతుంది సౌందర్య. మీ వియ్యంకురాలు భాగ్య చూసింది. అంటే.. ఆమె కళ్లారా చూసిందా? అని అంటుంది. ఇది కోర్టు కాదు.. నీతో నేను ఇక్కడ వాదించలేను.. అంటుంది ఏసీపీ. నీకు నీ కొడుకు మీద అంత ప్రేమ ఉంటే.. ఒక అమ్మాయితో తిరుగుతుంటే మీరేం చేశారు. ఇదేనా నీ కొడుకు మీద నీకున్న ప్రేమ.. అంటూ ఏసీపీ చెబుతుంది.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

హలో.. మీరు కాస్త హద్దులో మాట్లాడండి. నా కొడుకు వల్ల మోనిత గర్భం దాల్చలేదు. తను ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకోకుండా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీరు ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీకు డ్యూటీనే ముఖ్యం కదా.. అని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. దీంతో ఏసీపీ రోషిణి మేడమ్ షాక్ కు గురవుతుంది.

కట్ చేస్తే భాగ్య.. జరిగినవన్నీ తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయ్యో.. అంటూ తనలో తానే బాధపడుతుంది. ఇంతలో భాగ్య భర్త.. ఫుడ్ తీసుకొచ్చి తినమంటాడు. నువ్వు ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్లు ఇంకిపోవాల్సిందే కానీ.. దీపకు మాత్రం న్యాయం జరగదు.. అంటాడు. నేను కళ్లారా చూడకున్నా.. డాక్టర్ బాబే.. మోనితను చంపాడని తొందరపడి పోలీసుల ముందు నోరు జారాను. ఒక్క నోటి మాటతో డాక్టర్ బాబు తలరాత మారిపోయింది. ఆ దేవుడు నన్నెందుకు తీసుకుపోలేదు. ఊరుకోవే.. ఊరుకో.. జరిగిన దానికి నువ్వేం చేస్తావు. అల్లుడే ఈ హత్య చేశాడని చెప్పడానికి ఆ రోషిణి దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇదంతా నా కూతురు తలరాత.. అంటాడు. దీప నీ కూతురు కాదయ్యా.. మన కూతురు అయ్యా.. మన కూతురు అంటారు. దానికి ఆ దేవుడు అంతా మంచే చేయాలి. నువ్వు ఏడవకు అయ్యా.. అంటూ.. ఆయన తెచ్చిన ఫుడ్ ను నువ్వే తిను అంటూ చెబుతుంది.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

Karthika Deepam 13 Aug Today Episode : దీప, పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లిన సౌందర్య

కట్ చేస్తే.. దీప, పిల్లలు ఇంకా కార్తీక్ నే తలుచుకొని ఏడుస్తుంటారు. ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. నాకు మీరిద్దరూ వేర్వేరుగా ఉన్నప్పుడే బాగుందమ్మా.. అంటుంది శౌర్య. నాన్న డాక్టర్ బాబుగా ఉన్నప్పుడే నాతో ఎక్కువగా మాట్లాడేవాడు. నువ్వు వంటలక్కగా ఉన్నప్పుడే బాగుండేదానివి. ఇప్పుడు మీరు కలిసి.. మమ్మల్ని ఏపిస్తున్నారు. అంత మాట అనకండి. మా తలరాత అలా ఉంది. ఇది నేను, మీ నాన్న అనుకున్నది కాదు. మనందరం మళ్లీ కలిసి ఉండే రోజు వస్తుంది. ఏడవకండి.. అని దీప అంటుండగానే.. సౌందర్య వచ్చింది శౌర్య చూసి.. నానమ్మ అంటూ దగ్గరికి వెళ్తారు పిల్లలు.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

నాన్న ఇంట్లో లేడు నానమ్మ. పోలీసులు తీసుకెళ్లారు.. అని చెప్పగానే.. ఇప్పుడు నేను మీ నాన్న దగ్గరికే వెళ్లి వచ్చాను. తొందరలోనే మీ నాన్నను నేను విడిపిస్తాను. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు నాన్న. వెళ్లండి.. బట్టలు సర్దుకోండి.. అని చెబుతుంది సౌందర్య. ఎప్పుడొచ్చారు అత్తయ్య.. అని అడుగుతుంది దీప. వచ్చాను.. అంతా తెలిసింది. వాడి దగ్గరికే వెళ్లి వస్తున్నాను.. అనగానే ఎలా ఉన్నారు ఆయన అంటుంది దీప. గ్రహణం మింగేసిన చంద్రుడిలా ఉన్నాడు. మీరిద్దరూ కలిసిపోయారు. మళ్లీ నా ఇల్లు కళకళలాడుతుంది అనుకున్నా కానీ.. ఈ సమస్యలు ఏంటి? అంటుంది సౌందర్య. నువ్వు చీకటిని మరిచిపోయి.. వెలుతురు వస్తుందని గుర్తు పెట్టుకో.. అంటుంది సౌందర్య. నీ మీద, వాడి మీద నాకున్న నమ్మకం ఎప్పటికీ పోదు. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆయన కారణం కాదు.. అని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. అదే నిజం అయింది. నీ మీద, పిల్లల మీద ఉన్న ప్రేమతోనే వాడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాడికి మోనితను చంపేసేంత కోపం వచ్చింది. అది మీమీద వాడికి ఉన్న ప్రేమ తప్ప.. మోనిత మీద ఉన్న కోపం కాదు. నువ్వు దైర్యంగా ఉండు. వాడిని ఎలా బయటికి తీసుకురావాలి.. అనేది ఆలోచిద్దాం.. అని సౌందర్య.. దీపకు ధైర్యం చెబుతుంది.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో సెల్ లో ఉన్న కార్తీక్ కు, లేడీ కానిస్టేబుల్ చాయ్ తెచ్చి ఇస్తుంది. చాయ్ తాగండి అంటుంది. మా ఏసీపీ మేడమ్ కు కొంచెం కోపం ఎక్కువ. మీరేం అనుకోకండి. మీరు ఫీల్ అవ్వకండి. మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. నేను తీసుకొస్తా. మధ్యాహ్నం మీకు బిర్యానీ తెప్పించమంటారా? అంటుంది. దీంతో వద్దు అంటాడు. నీ పేరు ఏంటి? అని అడుగుతాడు కార్తీక్. ఏదైనా కావాలంటే చెప్పండి సార్.. అంటుంది. సరే.. అంటాడు.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

ఆ తర్వాత రోషిణి మేడమ్.. మోనిత గర్భం ఎలా దాల్చిందో తెలుసుకొని తెగ టెన్షన్ కు గురవుతుంది. కార్తీక్ తెలివైన వాడు. అందుకే.. ముందే మంచితనం ముసుగు వేసుకున్నాడు. ఆ ముసుగులో ఎన్ని లొసుగులు ఉన్నాయో నాకు తెలుసు. భార్య, తల్లిని నమ్మించి.. మోనితను వంచించాడు. చివరకు చంపేశాడు. దీప కళ్లకు గంతలు కట్టి.. ఆకాశమంత ఎదిగిపోయినట్టు చూపించాడు. మోనితకు కడుపు వచ్చేదాకా కలల రాకుమారుడిలా కనిపించాడు. కడుపు సంగతి బయటపడ్డాక.. కనుమరుగయ్యాడు. మోనితకు కడుపు చేసి ఇప్పుడు ప్రశాంతంగా సెల్ లో కూర్చున్నాడు. నేను వదలను.. అంటూ తనలో తానే అనకుంటుంది రోషిణి మేడమ్.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

కట్ చేస్తే.. కార్తీక్ వాళ్ల నాన్న ఇంట్లో అందరూ విషాదంతో కూర్చుంటారు. ఇంతలో భాగ్య.. క్యారేజ్ తీసుకొని వస్తుంది. వదిన గారు ఎక్కడ అని అడుగుతుంది. వదిన గారు.. నేనేం చేయలేదు వదినా.. అని అంటుంది. దీంతో ఊరుకో.. అంటుంది సౌందర్య. దీప పరిస్థితిని చూసి.. నీళ్లు తాగు.. అంటుంది సౌందర్య. ఇవైనా తాగు అంటుంది. ఇప్పుడు చెప్పు.. ఏం జరిగింది.. అని. దీంతో సూర్యాపేటలో అంజిని మోనిత బెదిరిస్తున్న వీడియోను సౌందర్యకు చూపిస్తుంది. ఆ వీడియో చూసి సౌందర్య షాక్ అవుతుంది. ఈ వీడియో చూసి పక్కాగా వాడు మోనితను చంపేసే ఉంటాడు.. అంటుంది సౌందర్య. దీంతో షాక్ అవుతారు అందరు.

karthika deepam 13 august 2021 friday 1117 episode highlights

తర్వాత కార్తీక్ ను చూడటానికి దీప పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. ఎంటి అలా చూస్తున్నావు దీప. నన్ను మళ్లీ చూస్తానో.. చూడనో అనుకున్నావా? అని అడుగుతాడు కార్తీక్. మిమ్మల్ని ఇలా చూస్తానని ఏనాడూ అనుకోలేదు డాక్టర్ బాబు.. అంటుంది. ఇటునుంచి చూస్తే నువ్వే జైలు పాలు అయినట్టు కనిపిస్తుంది దీప. నా వల్ల నీకు మళ్లీ శిక్ష పడినట్టు అనిపిస్తోంది.. అంటాడు. మీరు నేరం చేసినట్టు ఒప్పుకుంటున్నారా? అని అడుగుతుంది దీప. దీంతో వదిలేసేయ్ దీప. నా తరుపున ఒక్క సాక్ష్యం కూడా లేదు. నేను బయటికి రావాలంటే బలమైన సాక్ష్యం కావాలి దీప.. అనగానే దీప షాక్ కు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే శనివారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam : ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam : దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam 12 Aug Today Episode : సౌందర్య మాటలు నమ్మి.. కార్తీక్ ను ఏసీపీ రోషిణి విడుదల చేస్తుందా? సౌందర్యను అరెస్ట్ చేస్తుందా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam 11 Aug Today Episode : కార్తీక్ కారు డిక్కీలో రక్తపు మరకలు.. కార్తీకే.. మోనితను చంపినట్టు సాక్ష్యం చెప్పిన భాగ్య

Recent Posts

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

9 minutes ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

2 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

4 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

5 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

6 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

6 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

7 hours ago