Karthika Deepam : దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 13, 2021, 8:28 am

కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెరపై టీఆర్పీల్లో కింగ్. గత రెండు మూడేళ్ల నుంచి టాప్ టీఆర్పీ రేంటింగ్లను సొంతం చేసుకుంటోంది. ఇక టీఆర్పీ అంటే కార్తీకదీపం.. కార్తీకదీపం అంటే టీఆర్పీ అనే స్థాయికి ఎదిగింది. కార్తీకదీపం సీరియల్‌లోని ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్.. డాక్టర్ బాబు, కార్తీక్‌గా నిరుపమ్ పరిటాలకు ఎక్కువగా గుర్తింపు రాగా.. మిగిలిన పాత్రలన్నీ కూడా జనాల్లో ముద్ర వేశాయి.

Karthika Deepam Hima Fame Sahruda Dance Video

Karthika Deepam Hima Fame Sahruda Dance Video

సౌందర్య పాత్రలో అర్చన, మోనిత క్యారెక్టర్‌లో శోభా శెట్టి ఇలా అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక చిన్న పిల్లలుగా నటించిన శౌర్య, హిమలు కొన్నేళ్లు సీరియల్‌ను తమ భుజాల మీద నడిపించేశారు. శౌర్య పాత్రలో కృతిక, హిమ క్యారెక్టర్‌లో సహృద అదరగొట్టేస్తున్నారు. ఈ ఇద్దరూ తెరపైనే కాకుండా.. తెర వెనుకా దుమ్ములేపుతుంటారు. ఇక సహృద అయితే తన డ్యాన్సులతో అదరగొట్టేస్తుంటుంది. ఆమె డ్యాన్స్ ప్రోగ్రాంలోనూ కనిపించింది.

Karthika Deepam Hima Fame Sahruda Dance Video

Karthika Deepam Hima Fame Sahruda Dance Video

చిన్నప్పుడు సహృద డ్యాన్స్ ప్రోగ్రాంలో మెరిసింది. డ్రామా జూనియర్స్, చిన్న పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలలో సహృద కనిపించింది. అక్కడే రోషన్ అనే డ్యాన్సర్ కూడా పరిచయమైనట్టుంది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో పర్ఫామెన్స్‌‌లు చేశారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఇద్దరూ వేసిన స్టెప్పులు, వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా రోషన్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను సహృద షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. వంటలక్క కూతురు రచ్చ చేస్తోందిగా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp