Karthika Deepam Today Episode : అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?

Karthika Deepam Latest Episode : కార్తీక దీపం 02 ఆగస్టు 2021 సోమవారం ఎపిసోడ్ 1107 హైలైట్స్ చూస్తే.. డాక్టర్ బాబు.. రోషిణి మేడం దగ్గరకు వెళ్తాడు. ఏంటి డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు.. అంటే మోనిత గురించి మాట్లాడటానికి వచ్చాను అంటారు. మీరే నేరం చేశారు.. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి? ఇన్ని రోజులు మోనితను ఎందుకు భరించావు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. మోనిత చుట్టు ఇన్ని రోజులు తిరిగి.. ఇప్పుడు ఎందుకు మోనిత మీద నిందలు వేస్తున్నావు. నువ్వు ఒక డాక్టరే కదా. మరి మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఏం సమాధానం చెబుతావు. మోనిత ఇంటికి నువ్వు ఎందుకు ఊరికే వెళ్లావు. నీకు నచ్చినప్పుడు వెళ్తావు.. ఇప్పుడు మాత్రం మోనితను వద్దంటున్నావా? మీ ఇద్దరి మధ్య స్నేహమే ఉంటే… మోనిత కడుపులో బిడ్డ ఎందుకు పెరుగుతోంది.. అంటూ రోషిణి.. డాక్టర్ బాబును నిలదీస్తుంది.

karthika deepam 2 august 2021 monday episode highlights

దీంతో ప్రస్ట్రేషన్ లో స్టాప్ ఇట్ మేడం.. ఐయామ్ సారీ మేడం.. మోనితను నేను ఒక ఫ్రెండ్ గానే చూశాను. నేనెప్పుడూ హద్దులు దాటలేదు. కానీ హద్దులు చెరిపేశాను. మోనితను నమ్మాను. నేను మాత్రం దీపకు అన్యాయం చేయలేను. నన్నేం చేయమంటారు చెప్పండి.. అని డాక్టర్ బాబు చెప్పగానే.. మరి మోనిత పెళ్లి జరుగుతుందా? జరగదా? మోనితకు కడుపు చేసి.. ఇప్పుడు దీపకు అన్యాయం చేయను అని ఎలా చెబుతున్నారు.. అని ప్రశ్నిస్తుంది రోషిణి.

Karthika Deepam Today Episode : దీపను మెచ్చుకున్న రోషిణి మేడమ్

నాకు దీప వ్యక్తిత్వం నచ్చింది. దీప కూడా మీ గురించి మంచిగా చెప్పింది. నేను నిజానికి నేరం చేసిన వాళ్లను ఎవ్వరినీ వదలను. నాకు డ్యూటీనే ముఖ్యం కానీ.. దీపను చూస్తే జాలేసింది. తనను చూస్తే పరిపూర్ణమైన స్త్రీని చూసినట్టు అనిపించింది. భర్తలో మార్పు కోసం 10 ఏళ్లు పోరాడి పోరాడి అలసిపోయింది దీప. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? దీప, మోనిత.. ఇద్దరూ నాశనం అవుతారు. దీపను సేవ్ చేయాలంటే అంజి గురించి తెలిసింది. అందుకే.. అంజిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. నేను వచ్చింది కూడా అంజి గురించి మాట్లాడటానికే మేడమ్ అని అనగానే.. వద్దు మీరు ఇన్వెస్టిగేషన్ చేయకండి. అంజి సంగతి నేను చూసుకుంటా. మీరు వెళ్లండి.. దీపతో, పిల్లలతో సంతోషంగా ఉండండి.. అని రోషిణి మేడమ్ చెప్పగానే.. డాక్టర్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

karthika deepam 2 august 2021 monday episode highlights

సీన్ కట్ చేస్తే.. మోనిత దగ్గరికి వెళ్తుంది. మోనిత.. తనకు జరిగిన అవమానం గురించే తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రియమణి వచ్చి అంజి ఎవరమ్మా.. అంటూ మోనితను ప్రశ్నిస్తుంది. దీంతో వెంటనే కంగారు పడుతుంది మోనిత. ఇదే కంగారును నేను దీప వచ్చినప్పుడు కూడా చూశా. అంజి అనగానే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు. మీకు కడుపు చేసి కార్తీక్ తప్పు చేశాడని నేను ఇప్పటి దాకా అనుకున్నాను కానీ.. నాకెందుకో మీరే తప్పు చేశారని అనిపిస్తోంది. చెప్పండి.. అసలు అంజి ఎవరు. మీరు నన్ను కొట్టినా.. తిట్టినా నేను మాత్రం అస్సలు ఇక్కడి నుంచి వెళ్లిపోను. నాకు అంజి ఎవరో చెప్పాల్సిందే. అనగానే నోర్మూయ్.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది మోనిత.

karthika deepam 2 august 2021 monday episode highlights

కట్ చేస్తే.. సీన్ దీప దగ్గరికి వెళ్తుంది. అంజి ఆచూకీ తెలిసిందని రోషిణి మేడమ్ దీపకు కాల్ చేసి చెబుతుంది. అంజి సూర్యాపేటలో ఉన్నాడని.. వెంటనే అక్కడికి వెళ్లాలని.. కార్తీక్ కు కూడా ఈ విషయం తెలియకుండా వెళ్లు అంటూ చెబుతుంది రోషిణి మేడమ్. ఆతర్వాత అంజి ఆచూకీ విషయం మోనితకు కూడా తెలుస్తుంది. వెంటనే మోనిత కూడా సూర్యాపేట బయలు దేరుతుంది.

అయితే.. సూర్యాపేట బయలుదేరామని అనుకోగానే.. డాక్టర్ బాబు ఇంటికి వస్తాడు. చాలా నెర్వస్ గా కనిపిస్తాడు. ఏమైంది.. అలా ఉన్నారు. సరే.. నేను బయటికి వెళ్తున్నాను. ఒక పని మీద. పిన్ని దగ్గరికి వెళ్తున్నా.. అనగానే.. నా కోసం నువ్వు ఏదైనా రిస్క్ తీసుకుంటున్నావేమో అని అనిపిస్తోంది.. అనగానే మన కోసం తప్పదు. మీరు రాకండి. నేను వెళ్తా.. అని చెప్పి డాక్టర్ బాబుకు సర్దిచెబుతుంది దీప.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

6 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

7 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

9 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

11 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

13 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

15 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

16 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

17 hours ago