
karthika deepam 27 july 2021 latest episode 1102
Karthika Deepam : కార్తీక దీపం 27 జులై 2021 లేటెస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇది 1102 వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో దీపతో తన పిల్లలు ఎమోషనల్ అవుతారు. పిల్లలకు భోజనం పెడుతుంటుంది దీప. ఇందలో తన పిల్లలు ఇద్దరూ అమ్మా.. నాన్నకు భోజనం పంపించావా? అని అడుగుతుంది. నాన్నకు అమ్మమ్మ పంపిస్తుందిలే అని చెబుతుంది. ఎంతైనా మారు తల్లి మారు తల్లే కదమ్మా.. అంటూ తమ వయసుకు మించిన మాటలు మాట్లాడుతారు పిల్లలు. సవితి తల్లి దగ్గర పిల్లలు పెరిగితే చాలా కష్టం కదా అమ్మా.. మాకైతే ఇలాంటి సమస్యలు లేవు. మాకు సొంత అమ్మ ఉంది. అది మా అదృష్టం అంటూ.. ఏదేదో మాట్లాడబోయేసరికి.. ఊరుకోండి.. మీ వయసుకు తగ్గట్టు మాటలు మాట్లాడండి.. అంటూ వాళ్లను వారిస్తుంది దీప.
karthika deepam 27 july 2021 latest episode 1102
ఆ తర్వాత.. కార్తీక్… వాళ్ల తమ్ముడు ఆసుపత్రిలో వాళ్ల నాన్న డిశ్చార్జ్ గురించి మాట్లాడుతారు. నాన్న డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పక్కనే నువ్వు ఉండు. నేను ఉండను అని ఆదిత్యకు చెబుతాడు కార్తీక్. ఎందుకు అన్నయ్య.. నాన్న కోపం అలాగే ఉంటుందా? కోపం తగ్గుతుందిలే. నువ్వు కూడా నాన్న డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఉండు అన్నయ్య.. అని చెబుతాడు.
karthika deepam 27 july 2021 latest episode 1102
ఆసుపత్రిలోనే కార్తీక్, ఆదిత్య ఉండటంతో వాళ్ల కోసం క్యారేజ్ తీసుకొస్తుంది వాళ్ల అత్తమ్మ. అయ్యో.. మీరు ఎందుకు తీసుకొచ్చారు క్యారేజ్ అని అడిగుతారు కార్తీక్, దీప. ఏం కాదులే.. లేట్ అయింది. ఇదిగో తినండి అన్నం అంటూ హాస్పిటల్ లోని ఓ రూమ్ కు తీసుకెళ్తుంది. అప్పుడే.. మోనిత కూడా క్యారేజ్ పట్టుకొని ఆసుపత్రికి వస్తుంది. అయ్యో.. నా కార్తీక్ కు నువ్వు వడ్డిస్తావా? నేను క్యారేజ్ తీసుకొచ్చా. ఉత్త తెల్ల అన్నాన్ని మా కార్తీక్ తినడు. నేను భగారా, గుత్తి వంకాయ కూర తీసుకొచ్చా.. తిను కార్తీక్ అని అంటుంది మోనిత.
karthika deepam 27 july 2021 latest episode 1102
నేనే కార్తీక్ కు అన్నం వడ్డించాలి… లేదంటే విషం కలిపిన నీళ్లను తాగి చస్తా.. అని బెదిరిస్తుంది మోనిక. ఇంతలోనే అక్కడికి దీప వస్తుంది. అయ్యో.. అక్క నువ్వు కూడా వచ్చావా? పిల్లలను కూడా తీసుకురావాల్సింది. అందరం కలిసి తినేవాళ్లం కదా అని దీపతో అంటుంది. పిన్ని.. అసలు నువ్వు దీన్ని ఎందుకు ఇక్కడికి రానిచ్చావు అంటూ అడుగుతుంది దీప.
karthika deepam 27 july 2021 latest episode 1102
ఆ తర్వాత విషం కలిపిన నీళ్ల గురించి తన పిన్ని చెప్పడంతో.. చస్తే చావనీ.. అది చస్తే మనం ఏం చేస్తాం. చావవే.. అంటూ విషం కలిపిన నీళ్లు ఉన్న బాటిల్ కు మోనితకు ఇస్తుంది దీప. నువ్వు తాగకపోతే.. నేను తాగుతా అని గడగడా తాగేస్తుంది దీప. నిజానికి అవి విషం కలిపిన నీళ్లు కావు. విషం దానిలో ఉంది.. ఆ నీళ్లలో కాదు. అది బెదిరిస్తుంది కానీ చావదు.. అంటూ చెబుతుంది దీప.
karthika deepam 27 july 2021 latest episode 1102
వెంటనే మోనిత.. తట్టుకోలేక దీప కాళ్ల మీద పడుతుంది. దీప.. కార్తీక్ ను నేను.. ఇఫ్పుడు కాదు.. మీ పెళ్లి కాకముందు నుంచి ప్రేమిస్తున్నా. కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. నీ కాళ్లు పట్టుకుంటా దీప. కార్తీక్ ను నా నుంచి దూరం చేయకు.. అంటూ వేడుకుంటుంది మోనిత. దీంతో ఎమోషనల్ అయిన కార్తీక్. నువ్వు నీ పిచ్చి మాటలు ఆపు. నిన్ను నేను అస్సలు పెళ్లే చేసుకోను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. మా జీవితాలను నాశనం చేయడానికే వచ్చావు నువ్వు అంటూ మోనిత మీద సీరియస్ అవుతాడు కార్తీక్. అలా.. ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై ఒక…
This website uses cookies.