Karthika Deepam Latest Episode : 26 జులై ఎపిసోడ్.. వంటలక్క ఉచ్చులో పడిపోయిన మోనిత.. మోనిత చాప్టర్ క్లోజ్?
Karthika Deepam Latest Episode : కార్తీక దీపం సీరియల్.. 26 జులై 2021 నాటికి 1101 ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్ ఎక్కువగా మోనిత, దీప మధ్యే జరుగుతుంది. మా మధ్య నువ్వు అస్సలు రాకూడదు. నువ్వు మా ఆసుపత్రి నుంచి దొబ్బేయ్.. అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తుంది మోనిత. నీ సంగతి మొత్తం అంజి వస్తే తెలుస్తుంది. 25 వ తేదీన నువ్వు చేసుకునేది పెళ్లి కాదు.. నువ్వు జైలుకు వెళ్లిపోతావు.. తొందరపడకు.. అంటూ మోనితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప.

karthika deepam 26 july 2021 latest episode 1101
ఆ తర్వాత దీప.. రోషిణి ఇంటికి వెళ్లి.. రోషిణి సాయం కోరుతుంది. వాళ్లిద్దరూ కలిసి అంజి గురించి డిస్కషన్ చేస్తారు. అంజి ఎక్కడున్నాడో తెలియదు. అంజి దొరికితే కానీ.. అసలు విషయం బయటపడాలంటే.. మోనితను జైలుకు పంపించాలంటే అంజి రావాల్సిందేనని దీప.. రోషిణికి చెబుతుంది. అయినా.. పెళ్లి అయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి.. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అది కార్తీక్ తప్పు కూడా. కార్తీక్ కూడా చాలా తప్పు చేశాడు. కార్తీక్ కూడా తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని రోషిణి చెబుతుంది.

karthika deepam 26 july 2021 latest episode 1101
Karthika Deepam Latest Episode : అంజి గురించి మోనిత ఎంక్వయిరీ
ఈనేపథ్యంలో.. మోనిత.. అంజి గురించి ఎంక్వయిరీ చేస్తుంది. దీప నన్ను ఎలాగైనా బుక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే.. నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అనుకుంటుంది మోనిత. అందకే.. వెంటనే ఒకరికి ఫోన్ చేసి.. హాయ్ సార్.. అంజి సేఫ్ గానే ఉన్నాడు కదా.. అంటూ ఆరా తీస్తుంది. కానీ.. ఆ వ్యక్తి.. అంజి తమ దగ్గర లేడని.. అంజి షాప్ కూడా ఓపెన్ చేయడం లేదని చెబుతాడు. మూడు రోజులుగా అతడు కనిపించడం లేదని చెప్పేసరికి.. మోనిత షాక్ అవుతుంది.

karthika deepam 26 july 2021 latest episode 1101
ఆ తర్వాత ఇంటికి వచ్చి.. సామాన్లు సర్దుతుంటుంది దీప. ఇంతలో తన కూతుళ్లు వచ్చి అమ్మా ఏమైంది తాతయ్యకు అని అడుగుతారు. దీంతో.. తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతుంది. దీంతో ఇద్దరు పిల్లలు షాక్ అవుతారు. ఎందుకు తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందటూ ప్రశ్నిస్తారు. అలా.. 1101 ఎపిసోడ్ పూర్తవుతుంది.