KCR Cloud Burst, A New Type Of War
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునః నిర్మాణం చేయించిన యాదగిరి గుట్ట ఇటీవలే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యి భక్తులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడ లేని అద్బుతమైన దేవాలయంను నిర్మిస్తున్నాం… ఎప్పుడు చూడని అద్బుతాలను యాదాద్రి దేవాలయంలో చూపిస్తాం అంటూ కేసీఆర్ గత ఆరు ఏడు సంవత్సరాలుగా చెబుతూ వచ్చి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యాదాద్రి దేవాలయ పునః నిర్మాణం జరిపించారు. అంత భారీగా ఖర్చు చేసి నిర్మించిన దేవాలయంలోకి చిన్నపాటి వర్షం కే నీళ్లు రావడం జరిగింది.
దేవాలయం ప్రథాన ప్రాంగణంతో పాటు ఆఫీస్ ఇతర నిర్మాణాల్లో మూడు నాలుగు ఫీట్ల నీళ్లు వచ్చి చేరాయి. దాంతో ఫర్నీచర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. చిన్నపాటి వర్షంకే ఈ స్థాయిలో ఉంటే పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటో అంటూ స్థానికులు మరియు భక్తులు ఆందోళన చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన దేవాలయం కు వర్షం వస్తే పరిస్థితి ఏంటీ అంటూ చూసుకోవద్దా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాలయం పునః నిర్మాణం పేరుతో పూర్తిగా నాశనం చేశారు అంటూ సీఎం కేసీఆర్ పై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి యాదగిరి గుట్ట దేవాలయంలో నీళ్లు చేరడంపై స్పందించాడు.
KCR heavy rain damage newly built yadadri temple
ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులిపోయేది. ఎవరో కాంట్రాక్టర్ & ఆర్ట్ డైరెక్టర్ కు పని అప్పగించి మంచి యాదగిరిగుట్ట ను రెండు వేల కోట్లు రూపాయలతో నాశనం చేసారు. యాదాద్రి పనులలో ఎవరు ఎంత దోచుకున్నారు మరియు పనుల నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేశారు. నువ్వు 25 సార్లు వచ్చి ఏం చూసినట్లు.. ఏం చేసినట్లు అంటూ యాదగిరి గుట్ట నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని.. ఈ విషయమై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందే అంటూ విపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.