హుజురాబాద్ ఉప ఎన్నిక కాదు గానీ .. తెరపైకి బోలెడన్న కథలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇద్దరు మిత్రుల మధ్య .. బైపోల్ రచ్చ .. ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.. ఈటెల రాజేందర్ బర్తరఫ్ వెనుక .. భూ కబ్జా కారణం కాదని, సీఎం కుర్చీకే ఎసరు పెట్టడమేనని ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే దీనిపై ఈటెల రాజేందర్ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు..అయితే, ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టేంత కుట్ర చేసింది తాను కాదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు… ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడితే, కుమార్తెనో, కుమారుడో లేక మేనల్లుడికో అవకాశముంటుంది గానీ బడుగు బిడ్డను తానెందుకు, ఎలా పెడతానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి..
సీఎం కుర్చీ కోసం సీఎం కుటుంబంలోనే బోలెడన్ని కుట్రలు సాగుతున్నాయని, మేనల్లుడికి, కొడుక్కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని గతంలోనే కథనాలు వెల్లువెత్తాయి.. ఇప్పుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో మళ్లీ అవన్నీ.. తెరపైకి వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఈటెల రాజేందర్ పైకి మేనల్లుడిని పంపడం వెనుక కూడా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న వ్యూహం ఉందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ హుజూరాబాద్ లో ఓడిపోతే, దీనికి మేనల్లుడిని బాధ్యుడిని చేసి, పక్కనపెట్టేయాలన్నది సీఎం యోచనగా ఓ కథనం వినిపిస్తోంది. దీంతో గెలుపు చాలా అవసరమని, లేకుంటే, భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందని.. అందుకే ఈటెల రాజేందర్ పై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
ఈ కథనాల మాటెలా ఉన్నా, హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కు స్థానబలం ఉందని, సింపతీ కూడా కలిసిరానుందని తెలుస్తోంది. దీంతో ఎంత ట్రై చేసినా, దుబ్బాక సీన్ రిపీట్ కాక తప్పదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోన్న ఈటెల రాజేందర్ .. తనకు చెక్ పెట్టాలని చూస్తున్నా, టీఆర్ఎస్ కు చుక్కలు తప్పవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నోటిఫికేషన్ రాగానే, బీజేపీ శ్రేణులు సైతం తరలిరానుండడం, ఇంకా కాంగ్రెస్ ఎవరినీ బరిలోకి దించకపోవడంతో .. ఈటెల రాజేందర్ గెలుపు పక్కా అని, టీఆర్ఎస్ కు దుబ్బాక సీన్ రిపీట్ కాక తప్పదని టాక్ వినిపిస్తోంది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.