Anasuya Bharadwaj Ready to Mother roles
Anasuya Bharadwajబుల్లితెర నుంచి వెండితెరకు ఇంట్రడ్యూస్ అయి సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నది యాంకర్ అనసూయ Anasuya Bharadwaj. ‘జబర్దస్త్’తో పాటు పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అనసూయ భరద్వాజ్. సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ యాంకర్‌గా వ్యవహరిస్తుంది అనసూయ. వెండితెరపైకి అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. రంగమ్మత్తగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మెప్పు పొందింది.
Anasuya Bharadwaj Ready to Mother roles
‘రంగస్థలం’ ఫిల్మ్ తర్వాత పలు సినిమాల్లోనూ నటించడంతో పాటు ఐటమ్ సాంగ్స్‌లోనూ కనిపించింది అనసూయ. మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రం ‘విన్నర్’లో ఐటం సాంగ్‌లో నటించిన అనసూయ తాజాగా కార్తీకేయ హీరోగా వచ్చిన ‘చావు కబురు చల్లగా’ ఫిల్మ్‌లోనూ ఐటం సాంగ్‌లో కనిపించింది. ఈ సినిమాలోని ‘పైన పటారం లోన లొటారం’ సాంగ్ అనసూయ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘థాంక్యూ బ్రదర్’ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.ఈ క్రమంలోనే తాను హీరో, హీరోయిన్స్‌కు మదర్ రోల్ ప్లే చేయడానికి సిద్ధమేనని చెప్తోంది.అయితే, అటువంటి పాత్రలు చేయాలంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయి ఉండాలని, ఆ పాత్ర చేస్తే దాని గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకునేంత రేంజ్ ఉండాలనే షరతులు పెట్టింది అనసూయ.
Anasuya Bharadwaj Ready to Mother roles
ఈ మేరకు తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇకపోతే రంగమ్మత్త ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర ‘రంగస్థలం’ సినిమాకు మించి ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో పాటు మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలోనూ నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలోనూ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో అనసూయతో పాటు బ్రహ్మానందం, రమ్యకృష్ణ తదితర సీనియర్ నటులు ఉన్నారు.
Anasuya Bharadwaj
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
This website uses cookies.