
#image_title
MAnchu Lakshmi | ప్రముఖ నటి మంచు లక్ష్మిని కించపరిచేలా అడిగిన ప్రశ్నపై ఒక తెలుగు జర్నలిస్టు క్షమాపణలు చెబుతూ వివాదానికి ముగింపు పలికారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వయసు, దుస్తులపై జర్నలిస్టు వేసిన ప్రశ్న తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై మనస్థాపం చెందిన మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దాంతో, ఆ జర్నలిస్టు బేషరతుగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.
#image_title
క్షమాపణలతో..
ఆ వీడియోలో మాట్లాడుతూ, “అదేంటో నాకు యూనియన్ ద్వారా తెలిసింది. నేను చేసిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి గారికి మానసికంగా బాధ కలిగిందని అర్థమైంది. నా ఉద్దేశం ఎవ్వరినీ బాధ పెట్టడం కాదు. అందుకే ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను,” అని పేర్కొన్నారు. తన ప్రశ్నకు కారణాలు ఏమిటన్నదానిపై చర్చించదలుచుకోలేదని కూడా స్పష్టం చేశారు.
ఈ ఘటనపై మంచు లక్ష్మి స్పందిస్తూ, జర్నలిజం పేరుతో వ్యక్తిగత విషయాలను తవ్వడం తగదని, ఇది కేవలం క్లిక్‌బైట్ సంస్కృతి వల్లే జరుగుతోందని అన్నారు. జర్నలిస్టులపై ఉన్న గౌరవం దెబ్బతినకూడదని, మానవీయ విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.