Minister Roja : మిడత‌లు, ఉడ‌త‌ల్ని కూడా ప‌ట్టించుకుంటామా.. హైపర్ ఆది, గెట‌ప్ శీనుల‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన రోజా

ఇటీవ‌ల ఏపీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, తాళ్ల వలస వద్ద నిర్వహించిన ‘యువశక్తి’ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పాల్గొన్న విష‌యం తెలిసిందే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయ‌న అంద‌రిలో ఉత్సాహం క‌లిగించేలా మాట్లాడారు. ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహిని ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ పంచుల వ‌ర్షం కురిపించాడు. దీంతో హైపర్ ఆదిని. వైసీపీ నాయకుల్ని ఏకిపారేశారు. శ్రీరెడ్డి లాంటి వైసీపీ వీరాభిమానులు అయితే.. ఏకంగా లైవ్‌లు పెట్టి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు.

ఇక హైపర్ ఆదిగాడికి డైపర్ వేయాల్సిన టైం వచ్చేసింది. ఇది వాడి ఫోన్ నెంబర్ 8790045745.. ఫేస్ బుక్‌లో వైరల్ చేసి.. పద్దతిగా పలకరించండి’ అంటూ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి ఆర్మీ పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా ద‌ర్శ‌నం ఇచ్చింది. అయితే హైప‌ర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేప‌థ్యంలో రోజా స్పందించింది. మెగా కాంపౌండ్‌లో ఆరు హీరోలు ఉన్నారని, వాళ్ల ప్రాపకం కోసం ఇలా చిన్నిచిన్న ఆర్టిస్టులు జబర్దస్త్‌ కామెడీ చేస్తున్నారు అని రోజా విమ‌ర్శించింది సినిమాల్లో వేషాల కోసం తన మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వారు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.

Minister Roja reacts about comedian hyper aadi comments

మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండాపోతాయని భయంతో వారు అలా మాట్లాడతున్నారన్నారు. నిజంగా మెగా ఫ్యామిలీ అంటే ప్రేమ ఉంటే.. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్‌కు మ‌ద్దుతు ఇచ్చిన‌ప్పుడు ఏం జ‌రిగిందో మ‌నం చూశాం. ప్రేమ వేరు, భ‌యం వేరు. సినిమా ఫీల్డ్‌ నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు, శారద, బాబూమోహన్‌, తాను అందరం ఎన్నికల్లో గెలిచామని…వాళ్లు తప్ప అంటూ పవన్‌, నాగబాబులపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది రోజా. అయితే హైపర్‌ ఆది కామెంట్లను లైట్‌గా తీసుకుంటూనే హెవీ పొలిటికల్‌ పంచ్‌లతో రోజా గ‌ట్టిగా ఇచ్చేసింది. చిన్న మిడతలు, ఉడతలు గురించి పట్టించుకోవద్దంటూ త‌న‌పై విమ‌ర్శించే వారికి చుర‌క‌లు అంటించింది.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

7 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

8 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

10 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

11 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

12 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

13 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

13 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

14 hours ago