
MLA Roja home tour in jabardast and her properties and houses
MLA Roja : సినీ నటి సుదీర్ఘ కాలం తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా రోజా రాజకీయాల్లో ఉన్నారు. మొదట టిడిపిలో ఆ తర్వాత కాంగ్రెస్ లో ప్రస్తుతం వైకాపాలో రోజా కొనసాగుతున్నారు. వైకాపా నగరి ఎమ్మెల్యే గా ప్రస్తుతం రోజా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ టీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఆమె జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరించడం మామూలు విషయం కాదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె తన జబర్దస్త్ షో వదిలేయలేదు.రాజకీయాలతో బిజీ అయిన కారణంగా రోజా జబర్దస్త్ ను వదిలేస్తుందని అంతా భావించారు కానీ మంత్రి పదవి వచ్చిన కూడా తాను జబర్దస్త్ వదిలేది లేదు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
జబర్దస్త్ షోలో ఆమె వేసే కామెడీ పంచులు.. మరియు ఆమె చేసే స్కిట్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజా ఎపిసోడ్ లో హైపర్ ఆది ఆమె నగరి ఇంటిని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నగరి అనేది ఒక చిన్న మున్సిపాలిటీ అయినా అక్కడ ఆమె ఇల్లు రాజభవనాన్ని తలపించేలా ఉండి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. నగరిలో ఆమె అభిరుచికి తగ్గట్లుగా దాదాపు అయిదు కోట్లు ఖర్చు చేసి ఆ ఇంటిని నిర్మించారని సమాచారం అందుతోంది. రోజా నగరి ఇంటిని చూసిన జనాలు వావ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.జబర్దస్త్ లో మొదటి సారి ఒక హోమ్ టూర్ నిర్వహించడంతో ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. హోమ్ టూర్ చేస్తూనే హైపర్ ఆది తన కామెడీ పంచ్ లతో నవ్వించాడు. మొత్తానికి రోజా హోమ్ టూర్ మరియు కామెడీ రెండు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సమయంలో రోజా యొక్క ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల విషయమై ప్రచారం జరుగుతోంది. రోజా భర్త సెల్వమణి. ఆయనకు తమిళనాడులో రెండు ఇల్లులు ఉన్నాయట.
MLA Roja home tour in jabardast and her properties and houses
రోజా పేరు మీద కూడా ఒక ఇల్లు చెన్నై లోని టీ నగర్ లో ఉన్నది అనేది సమాచారం. అంటే రోజా కుటుంబంకు మొత్తంగా తమిళనాడులో 3 బంగ్లాలు ఉన్నాయి. ఇక సుదీర్ఘ కాలంగా హైదరాబాద్లో నటిగా కొనసాగుతున్న రోజా కు బంజారా హిల్స్ తో పాటు మడికొండలో కూడా ఇల్లులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సెల్వకు కూడా హైదరాబాద్ లో ఇల్లు ఉందట. మొత్తంగా రోజా దంపతులకు తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు తో కలిపి ఆరు ఏడు చిన్న పెద్ద బంగ్లాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. వాటి విలువ కోట్లలో ఉంటుంది అని అంటున్నారు. రోజా సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా చేసింది. అప్పట్లోనే ఆమె స్టార్ హీరోయిన్ కనుక ఆ మాత్రం సంపాదించడం లో ఆశ్చర్యం లేదు. అంతే కాకుండా ఆమె భర్త కూడా తమిళ సినీ రంగంలో కొనసాగుతున్నారు. కనుక వారి ఆదాయం మొదటి నుండి భారీగా ఉంది. అందుకే అప్పట్లోనే ఇళ్లను కొనుగోలు చేసి ఉంటారు. నగరిలో మాత్రం ఈ మధ్య కొత్తగా ఇల్లు కట్టారు. మధ్య తరగతి వారికి ఒక్క ఇల్లే పెద్ద టాస్క్ అంటే రోజా లాంటి సెలబ్రిటీలకు ఆరేడు బంగ్లాలు కట్టేస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.