Home » Devotional » Naga Sarpadosh Famous Temple Is
Devotional

Naga Sarpadosh | నాగసర్ప దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏంటో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 12, 2025, 6:00 am
Advertisement

Naga Sarpadosh | నాగసర్ప దోషం, కుజ దోషం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. వీటివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతారు. అయితే కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కి వెళ్లి పూజలు చేస్తే ఈ దోషాల నుంచి విముక్తి పొందవచ్చని పండితుల విశ్వాసం.

Advertisement

#image_title

క్షేత్రం ప్రాముఖ్యత

Advertisement

పశ్చిమ కనుమల్లో, దక్షిణ కర్ణాటక జిల్లాలోని కుమారగిరి అరణ్యంలో ధార నది తీరాన ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం, ఆరు సర్పాలు కాపలా కాస్తున్నట్లుగా రూపుదిద్దుకున్నది. ఇక్కడ దర్శనం చేసుకుంటే కాలసర్ప దోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

ఆలయ రీతులు

Advertisement

* భక్తులు ముందుగా ధార నదిలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్తారు.
* ఆలయం వెనుక తలుపు ద్వారా ప్రవేశించి మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
* గరుడ స్తంభం తరువాత సుబ్రహ్మణ్య స్వామి మందిరం, వాసుకి విగ్రహాలను దర్శిస్తారు.

ప్రత్యేక పూజలు

ప్రతిరోజూ నిత్య పూజలతో పాటు ఆశ్లేషబలి , సర్ప సంస్కారాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఈ పూజలు జరిపిస్తే నాగదోషం, కాలసర్ప దోషం, కుజదోషం తొలగిపోతుందని విశ్వాసం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి