Home » Entertainment » Nagarjuna And Jayapradha To Act Together In A Movie
Entertainment

Nagarjuna : నాగార్జున సినిమాలో ఆ పాత్రలో జయప్రద? ఆమె ఆ పాత్రకు నిజంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: June 24, 2021 1:52 pm
Advertisement

Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. నాగార్జున సినిమా సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున పేరు అదే బంగార్రాజు. ఆ సినిమాలో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించింది. తాజాగా మరోసారి ఆయన సరసన బంగార్రాజు సినిమాలో నటిస్తోంది రమ్యకృష్ణ.

Advertisement

nagarjuna and jayapradha to act together in a movie

సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఇది స్వీకెల్ గా వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున కొడుకు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. ఆయన కూడా సినిమా మొత్తం ఉంటారట. అయితే.. ఈ సినిమాలో మరో సీనియర్ నటి జయప్రద కూడా నటిస్తున్నారట. ఆమె వెండి తెరకు దూరమై చాలా కాలం అవుతోంది. తను ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. కొన్నేళ్ల పాటు ఆమె రాజకీయాల్లో ఉన్నారు.

Advertisement

nagarjuna and jayapradha to act together in a movie

Nagarjuna : సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమైన జయప్రద

అయితే.. జయప్రద సినిమాల్లో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోందట. అందుకే.. బంగార్రాజు సినిమాల్లో నటించేందుకు తను ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం.. జయప్రదను మూవీ యూనిట్ సంప్రదించిందట. ఆ సినిమాలో నాగార్జున అత్త పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. ఇదంతా నిజమా? లేక పుకారా? అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే.. నాగార్జునకు అత్తగా ఆమె నటించేందుకు అంగీకరిస్తుందా? అనేది తెలియదు.

Advertisement

nagarjuna and jayapradha to act together in a movie

ఇక.. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా.. శ్రీకారం హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుందట. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటోంది. జయప్రద ఈ సినిమాతో పాటు మరో వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. మొత్తానికి నాగార్జున సినిమాతో జయప్రద రీఎంట్రీ ఇస్తోందన్నమాట.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి