
Nandamuri Balakrishna Bought New house
Nandamuri Balakrishna : సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు, ఆస్థిపాస్థుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా వారి పర్సనల్ లైఫ్ మీదే అందరూ దృష్టి పెడుతుంటారు. తాజాగా బాలయ్య బాబు కొత్త ఇంటిని కొన్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ బాలయ్యకు బంజరాహిల్స్ రోడ్ నంబర్ 1లో విలాసవంతమైన భవనం ఉంది. కానీ ఇప్పుడు మరో ఇంటిని కొనుగోలు చేస్తుండటంతో హాట్ టాపిక్ అవుతోంది.
Nandamuri Balakrishna Bought New house
నందమూరి బాలకృష్ణ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసాడనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్ సమీపంలో ఖరీదైన ఇంటిని బాలయ్య భారీ రేటు పెట్టి కొనుగోలు చేసాడని టాక్. 9,935 చదరపు అడుగుల విస్తీర్ణం గల గ్రౌండ్ ఫ్లోర్, రెండు ఫ్లోర్‌లతో కూడిన ఈ ఇంటిని రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడట బాలయ్య. ఇక రూ.82.5 లక్షలకు ఇంటి స్టాంప్ డ్యూటీ అలాగే రిజిస్ట్రేషన్ కు మరో రూ.7.5 లక్షలు బాలయ్య ఖర్చు చేసినట్టు వినికిడి.
ఇక ఈ విషయాలు కాసేపు పక్కన పెట్టేస్తే.. బాలయ్య ఇప్పుడు బోయపాటి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హ్యాట్రిక్ దిశగా ఈ ఇద్దరూ బాగానే ప్రయత్నిస్తున్నారు . ఇప్పటికి సింహా, లెజెండ్‌లతో బ్లాక్ బస్టర్‌లు కొట్టేశారు. బోయపాటి సినిమా పూర్తి కాగానే.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ బ్యానర్‌లో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యే మైత్రీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించేశారు. మొత్తానికి బాలయ్య కూడా మంచి ఫాంలోనే ఉన్నాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.