Nara Lokesh New Story, TDP Cadre In Huge Shock
Nara Lokesh : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయడు పుత్ర రత్నం నారా లోకేష్ చాలా పెద్ద జోక్ చేశారు. ఔను, ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమీ వుండదు. ఆ జోక్ దెబ్బకి టీడీపీ క్యాడర్‌కే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ‘బాబోయ్, మా యువ నేత మరీ ఇలాంటోడా.?’ అని టీడీపీ క్యాడర్ విస్తుపోతోంది. టీడీపీ సీనియర్ నాయకులైతే, ‘నారా లోకేష్ వల్లనే పార్టీ భ్రష్టుపట్టిపోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు..’ అంటున్నారట. అసలేం జరిగింది.? ఇంతకీ నారా లోకేష్ పేల్చిన ఆ జోక్ ఏంటి.? ఎందుకు ఆ జోక్ ఇంత చర్చనీయాంశమయ్యింది.? ఆ జోక్ వల్ల పార్టీ క్యాడర్ ఎందుకు ఆశ్చర్యపోతోంది.? ఈ జోక్ దెబ్బకి, సీనియర్ నేతలు సైతం ఎందుకు షాక్‌కి గురయ్యారు.? అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.!
తనకు సంతోష్ పేరుతో ఇంకో కొడుకు వున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా నిన్న నారా లోకేష్, మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. అని అందరికీ తెలుసు. చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్. నారా లోకేష్ – బ్రాహ్మణి దంపతుల ముద్దుల తనయుడు దేవాన్ష్. దేవాన్ష్ పేరుతో చంద్రబాబు అండ్ టీమ్ గతంలో చాలా హడావిడి జరిగింది. ఇంతకీ, సంతోష్ ఎక్కడినుంచి వచ్చినట్లు.? రాలేదు, రప్పించారు నారా లోకేష్. ఎవరో తన మీద ఆరోపణలు చేస్తున్నారన్నది నారా లోకేష్ వాదన. తనకు ఇంకో కొడుకు వున్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించడం సంచలనంగా మారింది. అసలు ఇలాంటి అవసరం ఎవరికైనా ఎందుకు వుంటుంది.?
Nara Lokesh New Story, TDP Cadre In Huge Shock
నిజంగానే నారా లోకేష్ మీద అలాంటి అనుమానాలు ఎవరైనా వ్యక్తం చేస్తే, అది మీడియాలో ఖచ్చితంగా వార్త అయి తీరుతుంది. కానీ, అలాంటి వార్త ఏదీ మీడియాలో ఇంతవరకూ కనిపించలేదు. మరెలా నారా లోకేష్, సంతోష్ అనే పేరు తెచ్చి, తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అనగలుగుతున్నారు.? ఏమోగానీ, నారా లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న విమర్శ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది.ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చెత్త కనిపించొచ్చు. రాజకీయాల్లో వున్నవాళ్ళు అలాంటివాటిని అంత సీరియస్‌గా తీసుకోకూడదు.. ఒకవేళ అవి తమ దృష్టికి వచ్చినా, లైట్ తీసుకోవాలి. దారిన పోయే కంపని ఎక్కడో తగిలించుకున్నట్టు చేశారిప్పుడు నారా లోకేష్, ‘సంతోష్’ అనే పేరుని తెరపైకి తీసుకురావడం ద్వారా.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.