nikhil and anupama parameswaran in 18 pages movie
Anupama : అనుపమ పరమేశ్వరన్ తెలుసు కదా. క్యూట్ గర్ల్. కేరళకు చెందిన ఈ భామ.. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ పొజిషన్ కు చేరుకుంది. తన అందానికి కుర్రకారు కూడా మతి పోగొట్టుకుంటున్నారు. తను చీర కట్టి వయ్యారాలు ఒలికితే.. కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. తన చిట్టి చిట్టి పెదాలతో అనుపమ మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. అయితే.. అనుపమ చాలా లవ్లీ గర్ల్, సరదాగా ఉండే మనిషి.
nikhil and anupama parameswaran in 18 pages movie
తను షూటింగ్ లో ఎలా ఉంటుంది? షూటింగ్ సమయంలో మిగితా వాళ్లతో ఎలా ప్రవర్తిస్తుంది అనే దానిపై హీరో నిఖిల్ ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అనుపమ గురించి నిఖిల్ కు ఎలా తెలుసు అంటారా? ఎందుకంటే.. ఇప్పుడు ఇద్దరూ కలిసి 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ లుక్. ఈ సినిమాను కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
18 పేజెస్ ఫస్ట్ లుక్ కోసం తమ టీమ్ ఎంత కష్టపడిందో వివరిస్తూ.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు నిఖిల్. ఫస్ట్ లుక్ చిత్రీకరణ సమయంలో అనుపమ చేసిన అల్లరికి సంబంధించిన వీడియో అది. షూటింగ్ లో అనుపమ తెగ అల్లరి చేస్తోందంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అందరూ ఫస్ట్ లుక్ షూటింగ్ బిజీలో ఉంటే.. అనుపమ మాత్రం సారంగ దరియా పాటకు డ్యాన్స్ వేస్తూ చిన్నపిల్లలా ప్రవర్తించింది. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్లలో ఇంతలా ఎంజాయ్ చేస్తూ.. సరదాగా ఉండేవాళ్లను ఎవ్వరినీ చూడలేదు. వాళ్లలో అనుపమే బెస్ట్. అంటూ నిఖిల్ ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. తెగ వైరల్ చేస్తున్నారు.
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
This website uses cookies.