Undavalli Sridevi : డబ్బులు విషయంలో ఉండవల్లి శ్రీదేవి బండారం బయటపెట్టిన సొంత కార్యకర్త వీడియో వైరల్..!!

Undavalli Sridevi : ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడిందని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయడం తెలిసిందే. దీంతో నియోజకవర్గానికి దూరంగా ఉండి ప్రస్తుతం హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తనని సస్పెండ్ చేయడం పట్ల వైసీపీ అధినాయకత్వంపై ఉండవల్లి శ్రీదేవి గత ఆదివారం సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితులలో తాజాగా ఆమె నియోజకవర్గంలో ఓ కార్యకర్త.. ఉండవల్లి శ్రీదేవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఆదిలోనే తుంచేయాలి. అది ఎదిగి మానైతే పార్టీలో మిగతావాళ్లు చెడిపోతారు.

Old Man Comments On Undavalli Sridevi AP PUblic Talk On CM YS Jagan

ఉండవెల్లి శ్రీదేవిని సస్పెండ్ చేయడం చాలా మంచి పని అని పేర్కొన్నారు. ఆమె క్రాస్ ఓటింగ్ కి పాల్పడటం ముమ్మాటికి నమ్మక ద్రోహం అని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ హై కమాండ్ కి చెప్పుకొని పరిష్కరించుకోవాలి. ఈ రకంగా క్రాస్ ఓటింగ్ కీ పాల్పడి నమ్మకద్రోహం చేయటం పెద్ద తప్పు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. అయితే సస్పెండ్ అయిన నాయకులు తమను ఏదో చేసేస్తున్నారని భ్రమలో పడి.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో ఫ్రిడ్జ్ ఇంకా రకరకాలు వస్తువులు సొంత కార్యకర్తలు పెట్టుకున్నారు.

ఓ రకంగా ఉండవల్లి శ్రీదేవినీ రాజకీయంగా కార్యకర్తలే  ఎంతగానో పైకి తెచ్చుకున్నారు. అయితే ఆమె చేసిన పని వల్ల ఈరోజు సొంత కార్యకర్తలే తిరగబడ్డారు అని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర కూడా ఆమె డబ్బు తీసుకున్న మాట వాస్తవమని సంచలన ఆరోపణలు చేశారు. ఇటువంటి తాటాకు చప్పులకు జగన్ భయపడే మనిషి కాదని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ వైయస్ జగన్ దే అధికారమని పేర్కొన్నారు. దాదాపు 90 శాతం మహిళా ఓటింగ్ వైయస్ జగన్ కే ఉందని స్పష్టం చేశారు. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యకర్త … ఉండవల్లి శ్రీదేవి పై చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

3 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

6 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

13 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago