Pawan Kalyan : ప్రజలకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కావలి..!
Pawan Kalyan ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నిజమైన నాయకుడు. ఆయనను నేరుగా కలిసి సమస్యలు మొరపెట్టుకునే
Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నిజమైన నాయకుడు. ఆయనను నేరుగా కలిసి సమస్యలు మొరపెట్టుకునే వారు కొందరైతే.. కనీసం ఆయన దాకా వెళ్లలేక, కేవలం ఒక చిన్న లేఖ ద్వారా తమ ఆవేదనను తెలియజేసే సామాన్యులు మరెందరో. అయితే, సమస్య ఏదైనా, విజ్ఞాపన ఏ రూపంలో వచ్చినా.. అది తన దృష్టికి వస్తే చాలు, పరిష్కారం దొరికే వరకు పవన్ కల్యాణ్ నిద్రపోరని మరోసారి రుజువైంది. తాజాగా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, రాంబిల్లి మండల ప్రజలు పంపిన ఒకే ఒక్క లిఖితపూర్వక లేఖకు ఆయన ఆఘమేఘాల మీద స్పందించిన తీరు స్థానికుల్లో ఆనందాన్ని నింపింది.
Pawan Kalyan : ప్రజలకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కావలి..!
Pawan Kalyan దశాబ్దాల కాలుష్య కోరల నుండి కృష్ణంపాలెంకు విముక్తి
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం, కృష్ణంపాలెం గ్రామస్తులు చాలా కాలంగా తీవ్రమైన పారిశ్రామిక కాలుష్యంతో ప్రాణసంకటంలో జీవిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ ప్రాంతాన్ని కాలుష్య రహితంగా మార్చాలని, తమ ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. కానీ అప్పట్లో ఏ ఒక్క నాయకుడు, అధికారి వీరి ఆక్రందనలను పట్టించుకోలేదు. తాజాగా, ఏపీ డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్‌కు గ్రామస్తులు తమ గోడును లేఖ ద్వారా వివరించారు. అది తన సొంత నియోజకవర్గం కాకపోయినా సరే, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్న విషయాన్ని గ్రహించిన వెంటనే పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. తక్షణమే ఆ ప్రాంతంలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. పరిశ్రమ సీజ్
ప్యూటీ సీఎం ఆదేశాలు రావడంతోనే విశాఖపట్నంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హుటాహుటిన రాంబిల్లికి పరుగులు తీశారు. అక్కడ కాలుష్యానికి కారణమవుతున్న ‘బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్’ పరిశ్రమలోకి ప్రవేశించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. లోపలి యంత్రాలను, అవి వెలువరిస్తున్న కాలుష్య కారక వాయువుల తీవ్రతను నిశితంగా పరిశీలించారు. పరిశ్రమలోని వెంటిలేటర్ల ద్వారా వెలువడుతున్న ప్రమాదకరమైన కాలుష్య వాయువుల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నూరు శాతం వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే యాజమాన్యంపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. బాయిలర్ చిమ్నీకి కచ్చితంగా ‘మల్టీ సైక్లోన్ డస్ట్ కలెక్టర్’ (Multi-Cyclone Dust Collector) ఏర్పాటు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా, కేవలం నోటీసులకే పరిమితం కాకుండా.. ఈ డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేసేంత వరకు పరిశ్రమలో ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించకూడదని తేల్చి చెప్పారు. పనులు పూర్తయిన తర్వాత, తాము స్వయంగా వచ్చి పరిశీలించి సర్టిఫికెట్ ఇస్తేనే ఫ్యాక్టరీని తెరవాలని స్పష్టం చేస్తూ.. పరిశ్రమకు తాళాలు వేశారు. దశాబ్దాలుగా తమను పట్టి పీడిస్తున్న కాలుష్య భూతాన్ని, తాము పంపిన ఒక చిన్న లేఖతో తరిమికొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృష్ణంపాలెం వాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజమైన ప్రజా ప్రభుత్వం అంటే ఇలాగే వేగంగా స్పందించాలి అంటూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.







