Pawan Kalyan : జగన్ పెళ్ళికి వస్తే నన్ను రావద్దు అని చెప్పాడు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శించేది వైసీపీ అధినేత జగన్నే. చంద్రబాబు అధికారంలో ఉన్న … ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్నే తన టార్గెట్ గా భావించి పవన్ ఏకిపారేస్తూ ఉంటారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక.. పవన్ తన మాటల వేడి గట్టిగానే పేలుస్తూ ఉన్నారన్న సంగతి తెలిసిందే. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి అధికార పార్టీని నిలదీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జాప్యంపై వైసీపీ వ్యవహారంపై మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మేధావులతో పవన్ చర్చించడం జరిగింది.
Pawan Kalyan Comments On Ys Jagan
అయితే ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జగన్.. తీరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటుందని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. చాలా వేడుకలలో ఆయన వస్తూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్కమ్ టాక్స్ లో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఒక సంవత్సరం కిందట ఇక్కడే పెళ్లి జరిగింది. తన ఇంట్లో పెళ్ళికి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ల కుటుంబ సభ్యులు వైసీపీలో ఉంటారు. దీంతో మీరు నన్ను పిలిస్తే… మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆయన మాత్రం పంతం పట్టి నన్ను ఆహ్వానించారు. ఆయన బలవంతం పెట్టడంతో
Pawan Kalyan Comments On Ys Jagan
ఇంకా నేను ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరాను ఇంతలోనే ఫోన్ వచ్చింది. లేదు లేదు మీరు ఆగిపోవచ్చు.. అని చెప్పటం జరిగింది. దేనికి అని నేను అడిగితే ఇక్కడ నాయకులు మీరు వస్తే ఆయన రారు అని.. చెప్పారు. ఎవరు అని అడిగితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి వేరే ఇల్లల్లో పెళ్లికి వెళ్లిన సమయంలో నేను వెళ్ళాను.. కానీ అక్కడ అడ్డురానిది ఇక్కడ ఎందుకు అడ్డు వచ్చింది. పెద్ద పెద్ద పత్రికాధిపతుల, పారిశ్రామికవేత్తల పెళ్లికి.. వెళ్ళాం. అక్కడ రాని అడ్డు.. ఇక్కడ ఎలా వచ్చింది. గమనిస్తే అక్కడ ఉన్నత వర్గాలకు చెప్పలేడు గానీ చిన్న వర్గాల వాళ్ళను మాత్రం అణిచివేస్తాడు అన్న తరహాలో జగన్ పై పవన్ కామెంట్లు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
