
Perni Nani Next Level Punches on Pawan Kalyan
Perni Nani – Pawan Kalyan : కాపుల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెద్ద దుమారమే లేపాయి. గత ఎన్నికల్లో కాపులంతా తనకు ఓట్లేసి ఉంటే తాను గెలిచేవాడినని.. కాపులు ఐక్యంగా ఉండరని, డబ్బులు తీసుకున్నా వైసీపీకి ఓటేయొద్దని.. ఇలా రకరకాలుగా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ కూడా కౌంటర్లు ఇస్తోంది. తాజాగా మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ ను ఏకిపారేశారు. మామూలుగా కాదు.. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నాని. మీనోటితో మీరు 2014 లో నేను ఓట్లేసి గెలిపిస్తే..
Perni Nani Next Level Punches on Pawan Kalyan
ముఖ్యమంత్రిని చేస్తే మా అమ్మను తిట్టిస్తావా అని చంద్రబాబును తిట్టావు కదా. మరి ఇప్పుడు ఏం చేశావు. నేను అయితే మా అమ్మను తిట్టిస్తే.. జగన్ అయినా సరే నేను రాజీ పడను. అది కాపు పౌరుషం అంటే. నిజంగా ఒక కులంలో పుట్టి నేను ఈ కులంలో పుట్టాను అని చెప్పుకోవడం పౌరుషం.. ఏ కులం వాళ్లకు అయినా. తల్లిని తిట్టాక మళ్లీ మా అమ్మను తిట్టాడు అని చెప్పి మళ్లీ వాడి సంకనాకడం ఏంటి.. దాన్ని అంటారా ఊడిగం. వైసీపీలోని కాపులదా ఊడిగం. ఎవరిది ఊడిగం. నీ భాషకు, నీ ఆలోచనలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. భాష లేదు నిన్ను తిడతానికి.. అంటూ పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.
కాపులు, బీసీలు కలిసిపోవాలా? దేనికి. ఏం చేయాలి. ఈయనకు ముఖ్యమంత్రి అక్కర్లేదు. జగన్ ను ప్రశ్నించావు. అందరూ కలిసి పోండి. కాపులు కలిసిపోండి.. బీసీలు, ఎస్సీలు కలిసిపోండి అంటావు. కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయా? ఇంకో సంవత్సరమే కదా. చూస్తాం.. అన్నీ చూస్తాం. కాపుల ఆత్మగౌరవం తగ్గకుండా ఏం ఒప్పందాలు ఉంటాయో చూస్తాం. బీసీలతో గొడవ పడకండి. ఎస్సీలతో గొడవ పడకండి కాపులారా.. అంటున్నావు. ఎవరితో గొడవలు ఉన్నాయి. మీ రాజకీయం కోసం మేము గొడవలు పడాలా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.