Home » Entertainment » Priyanka Stunning Comments Viral
Entertainment

Priyanka | డ‌బ్బులిచ్చి కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు..సినీ అవకాశాలు తగ్గేందుకు కుట్ర ప‌న్నారంటున్న హీరోయిన్

Authored By
Sam C
The Telugu News | Published on: September 16, 2025, 6:00 pm
Advertisement

Priyanka | సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలై పోయిన ఈ రోజుల్లో… కొన్ని సందర్భాల్లో అది వ్యక్తిగత జీవితానికి, కెరీర్‌కూ పెద్దదెబ్బ అవుతోంది. ప్రస్తుతం మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె చేసిన షాకింగ్ కామెంట్లు తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.ప్రియాంక మోహన్, తనపై కావాలనే ట్రోలింగ్ జరుగుతోందని, ఈ ట్రోల్స్ వెనుక ఒక సంఘటిత కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

#image_title

కావాల‌నే చేస్తున్నారు..

Advertisement

“నాపై నెగిటివ్‌ ప్రచారం చేయించేందుకు డబ్బులిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నారు. ఇది నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి, అవకాశాలు తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం. నాకు అన్నీ తెలుసు,” అంటూ స్పష్టంగా చెప్పిన ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోలింగ్ విషయంలో ఏదో తేడా ఉందని అనిపిస్తోందని, ఇది ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అని చెప్పినట్టుగా తెలుస్తోంది.

కొంతకాలంగా ఆమెపై సోషల్ మీడియాలో నటనపై, ఎక్స్‌ప్రెషన్స్‌ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. “అసలే నటిగా ఎదుగుతున్న సమయంలో, ఇలాంటి ట్రోల్స్ నా కెరీర్‌కు తీవ్రమైన దెబ్బ అవుతున్నాయి,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కొలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం, ప్రియాంక ఇటీవల ఒక ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారట. దాంతో ఆమెపై కావాలనే నెగిటివ్ ప్రచారం మొదలైందన్నది ఓ వర్గం వాదన. ఈ నేపథ్యంలో ఆమెకు వచ్చిన అవకాశాల్లో తగ్గుదల కనిపించినట్టు తెలుస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి