Home » Entertainment » Raashi Khanna Intresting Comments On Food
Entertainment

Raashi khanna | ఇష్టమైన ఆహారాన్ని వదలకుండా త‌ని స్లిమ్‌గా మారాను.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: October 6, 2025 11:12 am
Advertisement

Raashi khanna | టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నటిగా మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్ ఐకాన్‌గా కూడా అభిమానులను ఆకట్టుకుంటున్న ఆమె, తన బరువు తగ్గిన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తాజా ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ – “చిన్నప్పటి నుంచి నాకు పరాఠాలు, రిచ్ ఫుడ్ చాలా ఇష్టం. ఆ కారణంగా నేను కొంచెం బొద్దుగా ఉండే వాడిని.

Advertisement

#image_title

ఫుడ్ సీక్రెట్స్..

Advertisement

కానీ సినిమాల్లో కెరీర్ ప్రారంభించిన తర్వాత తెరపై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండటం అవసరం అని అర్థమైంది. అప్పుడు నుంచే నేను సీరియస్‌గా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.అయితే, చాలామంది కఠినమైన డైట్ ప్లాన్లకు వెళ్లిపోతుండగా, తాను మాత్రం చిన్న చిన్న మార్పులతోనే ఫలితాలు సాధించానని రాశి తెలిపారు.

“నేను ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదలలేదు. బదులుగా, ఒకేసారి ఎక్కువగా తినడం మానేశాను. రోజులో ఆహారం తినే పద్ధతిని నియమితంగా మార్చుకోవడంతోనే నేను స్లిమ్‌గా మారగలిగాను” అని వెల్లడించారు.తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి మాట్లాడుతూ – “రోజూ జిమ్ చేయడం, యోగా సాధన అనేవి ఇప్పుడు నా డైలీ లైఫ్‌లో భాగమయ్యాయి. ఈ శారీరక వ్యాయామాల వల్ల నేను మానసికంగా కూడా ఎంతో స్టేబుల్‌గా ఉంటాను” అని అన్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి